News August 24, 2024
ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక సెల్: కలెక్టర్ ప్రశాంతి

తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని కలెక్టర్ ప్రశాంతి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 24 గంటల పాటు ఫిర్యాదు నమోదుకు 1800 4252540, 0883241 7711 కు ఫోన్ చేసి తెలపాలన్నారు. జిల్లాలో పెండ్యాల, పందలపర్రు స్టాక్ యార్డ్ల వద్ద వినియోగదారులకు అందించేందుకు ఇసుక సిద్ధంగా ఉందన్నారు.
Similar News
News October 27, 2025
ప్రజల భద్రతే తమ ప్రాధాన్యత: కలెక్టర్

జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం వచ్చే అవకాశం ఉందని APSDMA రెడ్ అలర్ట్ ఇచ్చినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం సూచించారు. 50-60 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో నిలవవద్దని హెచ్చరించారు. సోమవారం, మంగళవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
News October 26, 2025
సెలవు రోజులలో పాఠశాలలో తెరిస్తే కఠిన చర్యలు: DEO

మొంథా తుపాను నేపథ్యంలో జిల్లాలోని అన్ని పాఠశాలలకు 27, 28 తేదీలలో 2 రోజులు సెలవులు ప్రకటించినట్లు DEO కంది వాసుదేవరావు ప్రకటించారు. తుపాన్ నేపథ్యంలో ప్రజలకు అవసరమైతే పునరావాసం కోసం HMలు అందుబాటులో ఉండి పాఠశాల భవనాలు ఇవ్వాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. సెలవు దినాలలో రూల్స్ బ్రేక్ చేస్తూ పాఠశాలలు తెరిచిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని DEO హెచ్చరించారు.
News October 26, 2025
రాజమండ్రి: పాపికొండల విహారయాత్ర బోట్ల నిలిపివేత

తుపాన్ కారణంగా రాజమండ్రి నుంచి పాపికొండల విహారయాత్రకు బయలుదేరే బోట్లను నిలిపివేసినట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. తుపాన్ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదని ఆమె హెచ్చరించారు. గోదావరి పరివాహక ప్రాంతాలలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కూడా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు.


