News March 29, 2025
ఫిలిప్పీన్స్‌కు యాదాద్రి భువనగిరి బియ్యం

యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఫిలిప్పీన్‌కి బియ్యం ఎగుమతి అవుతున్నాయి. తెలంగాణ నుంచి 8 లక్షల టన్నుల బియ్యం ఎగుమతికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోగా జిల్లాలోని నాలుగు మిల్లుల నుంచి 1,570 మెట్రిక్ టన్నులు బియ్యం ఎగుమతి చేయాల్సి ఉంది. తొలి విడతలో 570 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని APలోని కాకినాడ పోర్టుకు లారీల ద్వారా చేరవేశారు. అక్కడి నుంచి నౌకలో ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి చేయనున్నారు.
Similar News
News July 8, 2025
MHBD: RMP వైద్యం వికటించి బాలుడు మృతి!

కేసముద్రం మండలం బావుజీ తండాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. RMP చేసిన వైద్యం వికటించి తమ కుమారుడు చరణ్ (15) మృతి చెందాడని ధరావత్ బాలోజీ, అనితా దంపతులు ఆరోపించారు. కడుపునొప్పితో RMP దగ్గరకు వెళ్తే రెండు ఇంజక్షన్లు, మూడు టాబ్లెట్స్ ఇచ్చారని తెలిపారు. కాసేపటికి బాలుడు మృతిచెందినట్లు చెప్పారు. తమకు న్యాయం చేయాలని వారు ఆందోళన చేస్తున్నారు.
News July 8, 2025
మల్యాల: ‘భార్య విడిగా ఉంటుందనే బాధతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం’

కొండగట్టులో గుడిసెల గట్టయ్య సోమవారం పెట్రోల్ పోసుకొని <<16984509>>ఆత్మహత్యాయత్నానికి <<>>పాల్పడిన విషయం తెలిసిందే. అయితే అతడు ఈ ఘాతుకానికి పాల్పడటానికి ప్రధాన కారణం తన భార్య కాపురానికి రాకుండా విడిగా ఉండటమే అని SI నరేష్ తెలిపారు. ఈ బాధతో మద్యానికి బానిసయిన అతడు సోమవారం ఉదయం విషం తాగాడు. ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స తీసుకోకుండానే కొండగట్టుకు వచ్చి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. క్షతగాత్రుడిది మేడిపల్లి మం. కొండాపూర్.
News July 8, 2025
10న చిత్తూరు జిల్లాలో PTM

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్-టీచర్ సమావేశం(PTM) ఈనెల 10న ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులు, వివిధ పాఠశాల యాజమాన్యాలతో ఆయన చర్చించారు. తల్లిదండ్రులకు వారి పిల్లల సమగ్ర నివేదికను అందజేయాలన్నారు. తల్లి పేరుతో మొక్క నాటాలని సూచించారు.