News March 15, 2025

ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ పనులు  

image

కేంద్ర ప్రభుత్వం తనిఖీ చేసిన తరువాత వెలువరించే ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ పనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. శనివారం కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివ రావు అసెంబ్లీలో చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి స్పందించారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై సానుకూలంగా ఉన్నామని తెలిపారు.

Similar News

News December 1, 2025

భారీ జీతంతో NTPCలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

<>NTPC<<>> 4 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు రేపటి వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బీఈ/బీటెక్, పీజీడీఎం/ఎంబీఏ ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. షార్ట్ లిస్టింగ్/స్క్రీనింగ్, రాత పరీక్ష/CBT, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.90వేలు చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC,ST,PwBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://careers.ntpc.co.in

News December 1, 2025

అధ్యక్షా.. కడప – బెంగుళూరు రైలు రోడ్డు కథ కంచికేనా..?

image

మదనపల్లి జిల్లా కల నెరవేరింది. కడప- బెంగళూరు రైలు రోడ్డు వేస్తామని మరిచారు. అయితే ఇవాళ పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో MP పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తన గళం వినిపించి కడప మదనపల్లి మీదుగా బెంగుళూరుకి రైల్వే రోడ్డుకు కృషి చేస్తారా ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాజంపేట పరిధిలో బస్ షెల్టర్ల ఏర్పాటుపై చర్చించి, గతంలో మంజూరైన రైల్వే రోడ్డు, బస్ షెల్టర్ల ఏర్పాటుకు కృషి చేస్తారా? చూడాలి.

News December 1, 2025

NGKL జిల్లాలో తగ్గిన చలి

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో నిన్నటితో పోలిస్తే చలి తీవ్రత కొద్దిగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో అమ్రాబాద్ మండలం వటవర్లపల్లిలో 18.1°C కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బిజినేపల్లిలో 18.3°C, తోటపల్లిలో 18.5°C, ఊర్కొండ, వెల్దండలలో 18.6°C, తాడూరులో 18.7°C, చారకొండ మండలంలో 18.8°C కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.