News March 15, 2025
ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ పనులు

కేంద్ర ప్రభుత్వం తనిఖీ చేసిన తరువాత వెలువరించే ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ పనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. శనివారం కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివ రావు అసెంబ్లీలో చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి స్పందించారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై సానుకూలంగా ఉన్నామని తెలిపారు.
Similar News
News April 25, 2025
ఖమ్మం: భానుడి ప్రతాపం.. ఈ మండలాల్లోనే అధికం

ఖమ్మం జిల్లాలో గురువారం నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. మధిరలో 43.1, KMM(U) ఖానాపురం PS 42.9, కారేపల్లి, కామేపల్లి (లింగాల) 42.8, ముదిగొండ(పమ్మి), సత్తుపల్లి 42.7, రఘునాథపాలెం 42.6, పెనుబల్లి 42.5, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం(బచ్చోడు) 42.0, కూసుమంచి 41.9, వైరా 41.8, వేంసూరు, కల్లూరు 41.6, ఎర్రుపాలెం 41.5, కొణిజర్ల, ఏన్కూరు 41.0, KMM (R) పల్లెగూడెంలో 40.3 డిగ్రీలు నమోదైంది.
News April 25, 2025
ఖమ్మం మిర్చి నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్.!

ఖమ్మంలో పండించే తేజ మిర్చికి అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతోంది. ఇతర రకాలతో పోలిస్తే ఖమ్మం తేజ మిర్చి ఘాటు ఎక్కువ కావడంతో ఇక్కడి నుంచే కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి పౌడర్, నూనెను విదేశాల్లో భారీగా ఉపయోగించడం వల్ల డిమాండ్ పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. అటు మార్కెట్‌లోనూ మిర్చి పోటెత్తుతోంది. కానీ ధరలు మాత్రం పెరగడం లేదని, ఉన్నతాధికారులు దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.
News April 25, 2025
పరీక్ష కేంద్రాల వద్ద భారీ భద్రత: ఖమ్మం సీపీ

ఖమ్మం జిల్లాలోని తెలంగాణ మోడల్ స్కూల్స్ ప్రవేశాల కామన్ ప్రవేశ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రకటనలో తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో 6వ నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాలకు ఈనెల 27న పరీక్ష జరుగనున్న నేపథ్యంలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.