News November 25, 2024
ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బంది పెట్టవద్దు: కలెక్టర్
ఫీజుల కోసం విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. కొన్ని ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయలేదని విద్యార్థులను క్లాసులకు, ప్రాక్టికల్స్‌కు అడ్డుకుంటున్నారన్నారు. తరగతి అనంతరం సంబంధిత ధ్రువ పత్రాలు జారీ చేయకపోవడం వంటి అంశాలు తమ దృష్టికి వచ్చాయన్నారు. విద్యార్థులను ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
Similar News
News December 10, 2024
నెల్లూరు జిల్లాకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం నెల్లూరు జిల్లాపై ప్రభావం చూపనుంది. ఇవాళ జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే బుధవారం, గురువారం భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News December 9, 2024
మరోసారి ఎంపీగా బీదకు ఛాన్స్..?
కావలికి చెందిన బీద మస్తాన్ రావు వైసీపీ, రాజ్యసభ ఎంపీ పదవికి ఇటీవల రాజీనామా చేసి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. మరోసారి రాజ్యసభ ఎంపీగా బీదకే టీడీపీ అధిష్ఠానం అవకాశం ఇచ్చిందని సమాచారం. రేపు సాయంత్రంతో నామినేషన్ గడువు ముగియనుంది. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం లోపు టీడీపీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
News December 9, 2024
నెల్లూరు: 11న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
నెల్లూరు జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియకు 4వ సారి కలెక్టర్ కార్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 11న నోటిఫికేషన్ విడుదల చేస్తామని కలెక్టర్ ఆనంద్ వెల్లడించారు. జిల్లాలోని ఇరిగేషన్, సోమశిల, తెలుగుగంగ ప్రాజెక్టుకు సంబంధించి 6 ప్రాజెక్టు కమిటీలు, 13 డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. వీటితోపాటు 490 వాటర్ యూజర్స్ అసోసియేషన్లు, 3698 టీసీలకు ఎన్నికలు జరుగుతాయి.