News May 10, 2024
ఫీజు అడిగితే ఫోన్ చేయండి: DEO

NLR: విద్యాహక్కు చట్టంలో భాగంగా ప్రైవేటు స్కూళ్లలోని ఒకటో తరగతిలో 25 శాతం సీట్లకు ఉచిత అడ్మిషన్లు ఇప్పించినట్లు నెల్లూరు డీఈఓ రామారావు తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారిలో మొదటి విడతగా 893 మందికి అడ్మిషన్ ఇప్పించినట్లు వెల్లడించారు. వీరిని ఆయా స్కూళ్ల యాజమాన్యాలు తిరస్కరించినా, ఫీజులు అడిగినా 9493233813 నంబరుకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
Similar News
News February 15, 2025
ప్రాక్టికల్ పరీక్షలలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: ఆర్ఐఓ

జిల్లాలో శనివారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షల్లో ప్రధాన భాగస్వాములైన ఎగ్జామినర్లు, చీఫ్, అడిషనల్ సూపరింటెండెంట్ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఆర్ఐఓ డాక్టర్ ఏ శ్రీనివాసులు ఆదేశించారు. శుక్రవారం తుది విడత పరీక్ష కేంద్రాల చీఫ్ అడిషనల్, చీఫ్ సూపరింటెండెంట్‌లకు నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆర్ఐఓ సూచించారు. పరీక్ష పై ఆపోహలు, ఆరోపణలు రాకుండా చూడాలని కోరారు.
News February 14, 2025
నెల్లూరు: పోలీస్ సిబ్బందికి ఎస్పీ సూచనలు

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం కందుకూరు పర్యటనలో భాగంగా బందోబస్తుకు సంబంధించి పోలీసు అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు 1060 మంది సిబ్బందితో పకడ్బందీ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ వారికి కేటాయించిన ప్రదేశాల్లో బందోబస్తు సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
News February 14, 2025
సంగం: లోన్ల కోసం 15వేల దరఖాస్తులు

కార్పొరేషన్ లోన్ల కోసం నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు 15వేల దరఖాస్తులు వచ్చాయని బీసీ కార్పొరేషన్ ఈడీ నిర్మలాదేవి పేర్కొన్నారు. శుక్రవారం సంగం ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాలుగు లక్షల సబ్సిడీతో మండలానికి ఒక జనరిక్ మెడిసిన్ యూనిట్ మంజూరైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో షాలెట్, సిబ్బంది తదితరులు ఉన్నారు.