News November 27, 2024
ఫుడ్‌పాయిజన్ కాంగ్రెస్ ప్రభుత్వ ఘోర వైఫల్యానికి నిదర్శనం: కవిత

నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్‌పాయిజన్ జరగడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘X’ వేదికగా స్పందించారు. ఈ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని, పాఠశాలలో పురుగులు పట్టిన అన్నం తిని బాధ భరించలేక కడుపు పట్టుకుని రోదిస్తుండటం చూసి ఓ తల్లిగా తన మనసు కలచి వేసిందన్నారు. ప్రతి పదిరోజులకు ఒక పసి ప్రాణం పోతున్నా కూడా సర్కారులో చలనం లేదు. ప్రజా పాలన అంటే ఇదేనా..? అని ప్రశ్నించారు.
Similar News
News December 6, 2025
NZB: జిల్లా స్థాయి సీనియర్ అర్చరీ ఎంపికలు

నిజామాబాద్ జిల్లా స్థాయి సీనియర్ అర్చరీ క్రీడాకారుల ఎంపికలు శుక్రవారం నగరంలోని రాజారాం స్టేడియంలో జరిగాయి. ఈ ఎంపికలో రాష్ట్ర స్థాయికి 70 మీటర్ల పురుషుల విభాగంలో N.రవీందర్ (గోల్డ్), N.రుత్విక్ (సిల్వర్), A.నవీన్ (బ్రాంజ్), ఇండియన్ రౌండ్లో బాయ్స్ విభాగంలో M.శ్రీధర్ (గోల్డ్), N.రాజేందర్ (సిల్వర్), SK రెహన్ (బ్రాంజ్) ఎంపికయ్యారని అర్చరీ కోచ్ రవీందర్ తెలిపారు.

News December 5, 2025
NZB: రాష్ట్రస్థాయి విలువిద్య పోటీలకు ఉమ్మడి జిల్లా క్రీడాకారులు

రాష్ట్రస్థాయి సీనియర్ గర్ల్స్ ఇండియా రౌండ్ విలు విద్య పోటీలకు ఉమ్మడి జిల్లాల క్రీడాకారులు ఎంపికైనట్లు జిల్లా విలువిద్య కార్యదర్శి గంగరాజు తెలిపారు. నిజామాబాద్ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాగారంలోని ఖేలో ఇండియా ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్ రాజారం స్టేడియంలో నిర్వహించిన ఎంపికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు హైదరాబాద్లోని కొల్లూరులో ఈనెల 7న ఆదివారం జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాన్నారు.