News February 8, 2025
ఫుడ్ పాయిజనింగ్ జరగలేదు: కలెక్టర్

వై.రామవరం మండలం చవిటిదిబ్బలు కస్తూరిబా పాఠశాలలో ఎటువంటి ఫుడ్ పాయిజనింగ్, నీటి కాలుష్యం జరగలేదని కలెక్టర్ దినేశ్ కుమార్ శుక్రవారం తెలిపారు. 14 మంది కస్తూర్బా విద్యార్థినులకు అస్వస్థత అంటూ వచ్చిన వార్తలపై కలెక్టర్ స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. 14 మంది విద్యార్థినులకు వేరు వేరు కారణాల వల్ల జలుబు, జ్వరం, దగ్గు, వాంతులు, విరేచనాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించినట్లు తెలిపారు.
Similar News
News March 25, 2025
టీమ్ ఇండియాలోకి రీఎంట్రీ నా చేతుల్లో లేదు: సిరాజ్

టీమ్ ఇండియాలోకి తిరిగి ఎంపికవ్వడం తన చేతుల్లో లేదని ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ అన్నారు. మెరుగైన ప్రదర్శన చేస్తూ వికెట్లు తీయడంపైనే తన దృష్టి ఉందని పేర్కొన్నారు. తన వంతుగా 100శాతం ప్రదర్శన చేస్తానని తెలిపారు. ఒకవేళ సెలక్షన్ గురించే ఆలోచిస్తే అది తన ఆటతీరుపై ప్రభావం చూపుతుందన్నారు. ఈ బౌలర్‌ను CTకి పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. కాగా ఐపీఎల్‌లో సిరాజ్ గుజరాత్ తరఫున ఆడుతున్నారు.
News March 25, 2025
బెట్టింగ్ యాప్స్.. టాలీవుడ్ స్టార్లకు బిగుస్తున్న ఉచ్చు

TG: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల వ్యవహారంలో పోలీసులు దూకుడు పెంచారు. ‘జంగిల్ రమ్మి’ కోసం రానా, ప్రకాశ్ రాజ్, ‘ఏ23’కి విజయ్ దేవరకొండ, ‘యోలో 247’కి మంచు లక్ష్మి, ‘జీట్ విన్’కు నిధి అగర్వాల్, ‘ఫెయిర్ ప్లే లైవ్’ కోసం ప్రణీత ప్రచారం చేసినట్లు గుర్తించారు. మరిన్ని వివరాలను సేకరించిన అనంతరం వీరిని విచారణకు పిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు బెట్టింగ్ యాప్ కంపెనీలపై కేసులు నమోదు చేస్తున్నారు.
News March 25, 2025
MLC Elections: ఏ పార్టీకి ఎన్ని ఓట్లు ఉన్నాయంటే..!

హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (ఏప్రిల్ 23) 116 మంది (కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో మెంబర్లు) తమ ఓటు హక్కును వినియోగించకోనున్నారు. ఎంఐఎంకు 49 ఓట్లు ఉండగా కాంగ్రెస్ పార్టీకి 13 ఉన్నాయి. ఇక బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు 54 మంది ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ 59 ఓట్ల కంటే ఎక్కువ వస్తే వారే విజయం సాధిస్తారు. ఎక్స్ అఫిషియో మెంబర్లుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఉంటారు.