News January 2, 2025
ఫూటుగా పెగ్గులెత్తారు!
కర్నూలు జిల్లాలో మందు బాబులు కిక్కుతో 2024కు వీడ్కోలు పలికి.. 2025 సంవత్సరానికి వెల్కమ్ చెప్పారు. డిసెంబర్ 31న మద్యం ప్రియులు ఫూటుగా తాగడంతో జిల్లాలో రికార్డు స్థాయి మద్యం అమ్మకాలు జరిగాయి. 24 గంటల్లో ఏకంగా రూ.11.5 కోట్ల లిక్కర్ బిజినెస్ జరిగింది. కర్నూలు జిల్లాలో రూ.6.30 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.5.20 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి.
Similar News
News January 8, 2025
ఆదోనిలో పత్తి క్వింటా రూ.7,500
ఆదోని మార్కెట్లో చాలా రోజుల తర్వాత పత్తికి గిట్టుబాటు ధర లభిస్తోంది. మార్కెట్ యార్డులో నిన్న క్వింటా రూ.7,500 పలికింది. పత్తి కోతలు మొదలైనప్పటి నుంచి ఇదే అత్యధిక ధర. నిన్న 3,131 క్వింటాళ్ల సరకు మార్కెట్‌కు రాగా గరిష్ఠ ధర రూ.7,509, సరాసరి రూ.7,209, కనిష్ఠ ధర రూ.5,080తో అమ్మకాలు జరిగాయి.
News January 8, 2025
ఆదోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ అవినీతి.. ఐదుగురు అరెస్టు
అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో ఆదోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు సీనియర్ అసిస్టెంట్ ఈరన్న, జూ.అసిస్టెంట్ రమేశ్, డాక్యుమెంట్ రైటర్లు మహబూబ్, షబ్బీర్, సాక్షి ఇలియాస్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు టూ టౌన్ సీఐ సూర్య మనోహర్ రావు వివరాలను వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారన్నారు. వారిని సబ్ జైలుకు తరలించామని, ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు.
News January 8, 2025
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
‘పాన్ కార్డు అప్డేట్ చేసుకోకపోతే.. ఈ రోజే మీ బ్యాంకు అకౌంట్ బ్లాక్ అవుతుంది’ అంటూ వచ్చే మెసెజ్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఎటువంటి లింకులు/apk ఫైల్స్ డౌన్లోడ్ చేసి ఇంస్టాల్ చేయకూడదన్నారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే బాధితులు 1930 నంబర్‌కు డయల్ చేసి సమాచారం అందించాలన్నారు.