News January 2, 2025

ఫూటుగా పెగ్గులెత్తారు!

image

కర్నూలు జిల్లాలో మందు బాబులు కిక్కుతో 2024కు వీడ్కోలు పలికి.. 2025 సంవత్సరానికి వెల్‌కమ్ చెప్పారు. డిసెంబర్ 31న మద్యం ప్రియులు ఫూటుగా తాగడంతో జిల్లాలో రికార్డు స్థాయి మద్యం అమ్మకాలు జరిగాయి. 24 గంటల్లో ఏకంగా రూ.11.5 కోట్ల లిక్కర్ బిజినెస్ జరిగింది. కర్నూలు జిల్లాలో రూ.6.30 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.5.20 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి.

Similar News

News July 5, 2025

పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే ధ్యేయం: మంత్రి

image

పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి టీజీ భరత్ అన్నారు. శనివారం నగరపాలక కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి స్వర్ణాంధ్ర-పీ4 (పబ్లిక్, ప్రైవేటు, పీపుల్స్, పార్టనర్షిప్) తొలి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్ -2047 కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, కుటుంబాల అర్హతలు పక్కాగా పరిశీలించి లబ్దిదారులను ఎంపిక చేయలని ఆదేశించారు.

News July 5, 2025

ఈనెల 10న జిల్లా వ్యాప్తంగా మెగా పీటీఎం: కలెక్టర్

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలలో ఈనెల 10న మెగా పీటీఎం 2.0 కార్యక్రమం
నిర్వహించాలని విద్యాశాఖ అధికారులను కర్నూలు క‌లెక్ట‌ర్ పి.రంజిత్ బాషా జిల్లా శనివారం ఆదేశించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం కోసమే పీటీఎం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మెగా పీటీఎం 2.0 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.

News July 5, 2025

వైసీపీ కర్నూలు జిల్లా వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శిగా ఉస్మాన్ సాహెబ్

image

వైసీపీ కర్నూలు జిల్లా వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శిగా గోనెగండ్లకు చెందిన కార్యకర్త ఉస్మాన్ సాహెబ్‌ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన జారీ చేసింది. ఉస్మాన్ సాహెబ్ మాట్లాడుతూ.. సామాన్య కార్యకర్త అయిన తనకు అధిష్ఠానం జిల్లా వాణిజ్య విభాగ కార్యదర్శి పదవి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఇన్‌ఛార్జ్ బుట్టా రేణుక, ఎంపీపీ నస్రుద్దీన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.