News April 11, 2025
ఫూలే సిద్దాంతాలు ఆదర్శప్రాయం: కలెక్టర్

సమ సమాజ స్థాపనకు అహర్నిశలు కృషి చేసిన సంఘ సంస్కర్త సామాజిక తత్వవేత్త మహాత్మా జ్వోతిరావ్ ఫూలే అని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ఫూలే జయంతి వేడుకలను పురస్కరించుకొని కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సామాజిక అసమానతలను రూపుమాపేందుకు సామాజిక ఉద్యమానికి అలుపెరగని పోరాటం చేశారన్నారు.
Similar News
News April 20, 2025
ఆయన వల్లే IPL సాధ్యమైంది: లలిత్ మోదీ

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వల్లే ఐపీఎల్ ఆలోచన కార్యరూపం దాల్చిందని లీగ్ ఫౌండర్ లలిత్ మోదీ చెప్పారు. తనను గుడ్డిగా నమ్మి ప్రోత్సహించడంతోనే ఐపీఎల్ కల నిజమైందని ఇన్‌స్టాలో ఆర్టికల్‌ను పోస్ట్ చేశారు. ఇప్పుడు IPL లేకుండా క్రికెట్ ప్రపంచాన్నే ఊహించలేమన్నారు. పవార్ విజనరీని మరిచిపోవద్దన్నారు. శరద్ పవార్ 2005-08 మధ్య బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు.
News April 20, 2025
క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. యువకుడి మృతి

TG: మేడ్చల్(D) రాంపల్లి దాయరలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతూ ప్రణీత్(32) గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. త్యాగి స్పోర్ట్స్ వెన్యూ గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడుతుండగా అతనికి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ప్రణీత్‌ను బోయినపల్లి వాసిగా గుర్తించారు.
News April 20, 2025
బాలుడిని కిడ్నాప్ చేసి లైంగిక దాడి.. మహిళకు జైలు శిక్ష

రాజస్థాన్‌లో ఓ బాలుడిని(17) అపహరించి లైంగిక దాడికి పాల్పడిన మహిళ(30)కు బుండీ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2023 నవంబరు 7న ఘటన జరగగా, బాధితుడి తల్లి అప్పట్లో పోలీసుల్ని ఆశ్రయించారు. నిందితురాలు తమ కుమారుడికి మద్యం పట్టించి లైంగిక దాడికి పాల్పడిందని వారికి తెలిపారు. దర్యాప్తులో ఫిర్యాదు నిజమని నిర్ధారణ కావడంతో పోక్సో కోర్టు నిందితురాలికి జైలు శిక్షతో పాటు రూ.45వేల జరిమానా విధించింది.