News February 25, 2025
ఫేక్ ఉద్యోగ ప్రకటనలపై జాగ్రత్త: ఎస్పీ

ఫేక్ ఉద్యోగ ప్రకటనలు, లాటరీ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యక్తిగత సమాచారం, పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డ్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. అపరిచిత లింక్లు, ఈమెయిల్లపై క్లిక్ చేయవద్దన్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు ఎక్కువగా షేర్ చేయవద్దన్నారు.
Similar News
News November 20, 2025
పోలి పాడ్యమి రోజున 30 వత్తులు ఎందుకు?

కార్తీక మాసంలోని 30 రోజులకు ప్రతీకగా పోలి పాడ్యమి రోజున 30 వత్తులు వెలిగిస్తారు. కార్తీక మాసంలో దీపారాధన చేయలేని వారు, ఈ ఒక్క రోజు 30 వత్తులు వెలిగిస్తే, అన్ని రోజుల పుణ్యం లభిస్తుందని నమ్మకం. కొందరు 31 వత్తుల దీపాన్ని కూడా పెడతారు. మరికొందరు గంగాదేవిని ఆరాధిస్తూ 2, గణపతి కోసం 2 పెడతారు. అదనంగా 4 వత్తుల దీపం పెట్టేవారు కూడా ఉంటారు. ఈ నియమం ప్రకారం.. 30-35 ఎన్ని వత్తుల దీపమైనా వెలిగించవచ్చు.
News November 20, 2025
ఢిల్లీ బ్లాస్ట్: అల్ ఫలాహ్లో 10 మంది మిస్సింగ్!

ఢిల్లీ పేలుడు మూలాలు అల్ ఫలాహ్ యూనివర్సిటీలో బయటపడిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన తర్వాత వర్సిటీకి చెందిన 10 మంది కనిపించకుండా పోయినట్లు సమాచారం. ఇందులో ముగ్గురు కశ్మీరీలు కూడా ఉన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. వాళ్లందరి ఫోన్లు స్విచ్చాఫ్లో ఉన్నట్లు చెప్పాయి. ఆ 10 మంది టెర్రర్ డాక్టర్ మాడ్యూల్కు చెందిన వారు కావచ్చని అనుమానిస్తున్నాయి. బ్లాస్ట్ వెనుక జైషే మహ్మద్ ఉండొచ్చని వెల్లడించాయి.
News November 20, 2025
NZB: గుర్తు తెలియని వ్యక్తి మృతి

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు 1 టౌన్ SHO రఘుపతి బుధవారం తెలిపారు. అయితే ఈనెల 10న కిసాన్ గంజ్ మార్కెట్ వద్ద ఓ వ్యక్తి పడి ఉండగా స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సదరు వ్యక్తి చికిత్స పొందుతూ ఈనెల15న మృతి చెందాడు. మృతుడికి సంబంధించి వివరాలు తెలియ రాలేదని, ఎవరైనా గుర్తుపడితే వన్ టౌన్ నువ్వు సంప్రదించాలని తెలిపారు.


