News March 9, 2025

ఫైనల్లో పోరాడి ఓడిన శ్రీ సత్యసాయి జట్టు

image

గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వేదికగా జరిగిన హాకీ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీ సత్యసాయి హాకీ జట్టు నిరాశపరిచింది. సీనియర్ పురుషుల హాకీ ఫైనల్లో శ్రీ సత్యసాయి జట్టు తిరుపతి జట్టుతో పోరాడి ఓడింది. శనివారం మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో శ్రీ సత్యసాయి హాకీ జట్టు 4-2తో ఓటమి చెందినట్లు సత్యసాయి జిల్లా హాకీ సెక్రెటరీ సూర్య ప్రకాశ్ తెలిపారు. జట్టును ముందుకు నడిపించిన కోచ్ హస్సేన్‌ను అభినందించారు.

Similar News

News February 8, 2026

MBNR: రేపటితో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం

image

మహబూబ్‌నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎస్పీ డి.జానకి స్పందిస్తూ.. ప్రచార సమయం ముగిసిన వెంటనే బయటి ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ నాయకులు, కార్యకర్తలు జిల్లా విడిచి వెళ్లాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 8, 2026

NLG: ఓట్ల లెక్కింపునకు వేదిక ఖరారు.. 3 రోజులు సెలవు!

image

నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం నిడమనూరులోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను కౌంటింగ్ కేంద్రంగా అధికారులు ఎంపిక చేశారు. జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఈ పాఠశాలకు ఫిబ్రవరి 11 నుంచి 13 వరకు స్థానిక సెలవులను ప్రకటించారు. లెక్కింపు ప్రక్రియకు ఆటంకం కలగకుండా ప్రిన్సిపాల్ తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

News February 8, 2026

KNR: మున్సిపల్ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు: సీపీ

image

కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టామని సీపీ గౌష్ ఆలం తెలిపారు. ఎన్నికల కోడ్ అమలు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, సమస్యాత్మక కేంద్రాలపై వెబ్ కాస్టింగ్ ద్వారా నిఘా ఉంచుతామని పేర్కొన్నారు. అల్లరి మూకలను ఇప్పటికే బైండ్ ఓవర్ చేశామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు భయం లేకుండా ఓటు వేయాలని సూచించారు.