News February 6, 2025

ఫైళ్ల క్లియరెన్స్.. నిమ్మలకు 22వ ర్యాంకు

image

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో ప.గో జిల్లా మంత్రి నిమ్మల రామానాయుడు 22వ ర్యాంకు పొందారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సూచించారు.

Similar News

News October 25, 2025

‘మొంథా తుపాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలి’

image

మొంథా తుపాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఆమె జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రానున్న 3 రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. జిల్లాలో ఏ ఒక్క ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తీరం దాటే సమయంలో గంటకు 90-100 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు.

News October 25, 2025

రేపటి నుంచి 3 రోజులు బీచ్‌కి రావొద్దు: ఎస్సై

image

తుపాన్ హెచ్చరికల జారీ, సముద్రంలో అలల ఉద్ధృతి పెరిగిన కారణంగా ఈ నెల 26 నుంచి 28 వరకు పేరుపాలెం బీచ్‌లోకి సందర్శకులకు అనుమతి లేదని మొగల్తూరు ఎస్సై వాసు శనివారం తెలిపారు. వాతావరణంలోని మార్పుల వల్ల అలలు వేగంగా వస్తుండటంతో ప్రమాదం సంభవించే అవకాశం ఉందన్నారు. సందర్శకులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

News October 25, 2025

సురక్షా యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌ వద్ద కలెక్టర్ చదలవాడ నాగరాణి సురక్షా యాప్ వినియోగం, ప్లాస్టిక్ నిషేధం, గంజాయి, మత్తు పదార్థాల తనిఖీలు, ఎక్సైజ్ శాఖ ప్రగతి తదితర అంశాలపై ఎక్సైజ్ అధికారులతో సమీక్షించారు. కల్తీ అక్రమ మద్యాన్ని పూర్తిగా నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులకు సురక్షా యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. వినియోగదారులు ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.