News February 6, 2025

ఫైళ్ల క్లియరెన్స్.. పవన్‌కు 10వ ర్యాంకు

image

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో కాకినాడ జిల్లా మంత్రి పవన్ కళ్యాణ్‌కు 10వ ర్యాంకు పొందారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సీఎం సూచించారు.

Similar News

News October 18, 2025

సచివాలయ ఉద్యోగులకు అదనపు బాధ్యతలు

image

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు జాబ్ ఛార్ట్‌తో పాటుగా కొన్ని అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పౌరుల డేటా సేకరణ, ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు, సేవలు చేర్చాలని, సచివాలయాలకు వచ్చిన వినతుల పరిష్కారం, విపత్తుల సమయంలో హాజరు, ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను నెరవేర్చాలని పేర్కొంది. ఉత్తర్వులు అతిక్రమించిన వారిపై కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

News October 18, 2025

దీపావళి పండుగ తేదీపై స్పష్టత

image

దీపావళి, ధనలక్ష్మి పూజలను నరక చతుర్దశి రోజు, సోమవారం జరుపుకోవాలని ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ స్పష్టం చేశారు. సోమవారం మధ్యాహ్నం 1:55 నుంచి మంగళవారం మధ్యాహ్నం 2:59 వరకు అమావాస్య ఘడియలు ఉంటాయన్నారు. ఈ కారణంగా నోములు సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయం ఆచరించవచ్చని తెలిపారు.

News October 18, 2025

NTR: అటెండర్ ఉద్యోగం.. విదేశీ టూర్లు.. ఎట్టా సామీ..? (2/2)

image

విజయవాడ పన్నుల శాఖ-2 అటెండర్ కొండపల్లి శ్రీనివాస్ అక్రమ సంపాదనతో ఏటా విదేశీ పర్యటనలు చేస్తున్నట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. అటెండర్ స్థాయి వ్యక్తి వీసా, పాస్‌పోర్టు కలిగి ఉండటంపై అధికారులు నివ్వెరపోయారు. ఆఫీసు సమయం తర్వాత దర్జాగా వసూళ్లు చేసే శ్రీనివాస్‌కు పన్నుల శాఖలో హైలెవెల్ అధికారుల అండ ఉందని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఈ కోణంలో విచారణ జరిపితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.