News February 6, 2025

ఫైళ్ల క్లియరెన్స్.. పార్థసారథికి 23వ ర్యాంకు

image

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో ఏలూరు జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి 23వ ర్యాంకు పొందారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సూచించారు.

Similar News

News October 28, 2025

VJA: ‘వరి, పత్తి పొలాల్లో నీరు నిల్వ లేకుండా జాగ్రత్త పడండి’

image

వరి, పత్తి పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలని జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయ కుమారి రైతులకు సూచించారు. పొలాల్లోని నీరు బయటకు వెళ్లేలా పంట బోదేలు, డ్రైనేజీలను సిద్ధం చేసుకోవాలన్నారు. తుపాను వెళ్లే వరకు వరి కోత పనులను వాయిదా వేసుకోవాలని సూచించారు. వర్షానికి అధైర్య పడకుండా అప్రమత్తంగా ఉండాలని రైతులను ఆమె కోరారు.

News October 28, 2025

వనపర్తి: వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

వనపర్తి జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. రైతులు వరి కోతలు చేపట్టవద్దన్నారు. వర్షం పడేటప్పుడు చెట్లు, విద్యుత్ స్తంభాల కింద ఉండకూడదని, శిథిలావస్థ భవనాలలో నివాసం ఉండరాదని సూచించారు. ఉరుములు, మెరుపులకు పిడుగులు పడే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలన్నారు.

News October 28, 2025

NLG: శిశు విక్రయ ఘటనపై సీరియస్… కేసు నమోదు

image

నల్గొండ జిల్లాలో శిశు విక్రయం ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. శిశువును అమ్మిన తల్లిదండ్రులు బాబు, పార్వతితో పాటు కొనుగోలు చేసిన వ్యక్తులు, మధ్య దళారులుగా వ్యవహరించిన వారిపై కేసు నమోదు చేయాలని నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఐసీడీఎస్ అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.