News February 6, 2025
ఫైళ్ల క్లియరెన్స్.. సుభాశ్‌కు లాస్ట్ ర్యాంకు

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో అంబేడ్కర్ కోనసీమ జిల్లా మంత్రి వాసంశెట్టి సుభాశ్ 25వ ర్యాంకు పొందారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సీఎం సూచించారు.
Similar News
News November 17, 2025
WGL: మక్కలు(బిల్టీ) క్వింటాకు రూ.2,080

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి మొక్కజొన్న సోమవారం తరలివచ్చింది. అయితే, గతవారంతో పోలిస్తే నేడు మొక్కజొన్న ధర తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు. గతవారం మక్కలు(బిల్టీ) క్వింటాకు రూ.2,090 పలకగా.. ఈరోజు రూ.2,080కి చేరింది. అలాగే, దీపిక మిర్చికి రూ.18వేల ధర వచ్చింది. మార్కెట్లో కొనుగోళ్లు జోరుగా కొనసాగాయి.
News November 17, 2025
మూడో భర్తకూ హీరోయిన్ విడాకులు!

మలయాళ హీరోయిన్ మీరా వాసుదేవన్ మూడో భర్తకూ విడాకులు ఇచ్చినట్లు సమాచారం. 2025 AUG నుంచి సింగిల్‌గా ఉంటున్నానని ఆమె ఇన్‌స్టాలో పోస్టు చేశారు. మీరా 2005లో విశాల్ అగర్వాల్‌ను పెళ్లాడి ఐదేళ్లకు డివోర్స్ ఇచ్చారు. 2012లో నటుడు జాన్ కొక్కెన్‌ను వివాహం చేసుకోగా ఓ బాబు పుట్టాడు. 2016లో ఆయనకు విడాకులిచ్చి 2024లో కెమెరామెన్ విపిన్‌ను పెళ్లాడారు. కాగా ఈమె తెలుగులో గోల్మాల్, అంజలి ఐ లవ్ యూ చిత్రాల్లో నటించారు.
News November 17, 2025
‘అన్నదాత సుఖీభవ’.. అచ్చెన్న కీలక ఆదేశాలు

AP: ఈ నెల 19న <<18310567>>అన్నదాత సుఖీభవ<<>> పథకం అమలు నేపథ్యంలో అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘అర్హులైన రైతులు చనిపోతే వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలి. NPCIలో ఇన్‌యాక్టివ్‌గా ఉన్న అకౌంట్లను యాక్టివేట్ చేయాలి. ఈ దిశగా రైతులకు అవగాహన కల్పించాలి. అలాగే ఈ స్కీమ్‌కు అర్హత ఉన్న వారు ఆన్లైన్లో నమోదు చేసుకునే విధానాన్ని సులభతరం చేయాలి’ అని సూచించారు.


