News August 19, 2024
ఫొటోగ్రఫీ డే.. కెమెరామేన్ అవతారమెత్తిన సీఎం
వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా సీఎం చంద్రబాబు ఫొటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న ఫొటో జర్నలిస్టులు సీఎంను కలిశారు. అనంతరం చంద్రబాబు వారి చేతిలో కెమెరా తీసుకుని ఫొటోలు క్లిక్ మనిపించారు. మీడియాలో ఉంటూ వివిధ కార్యక్రమాల ఫొటోలను తీయడం చాలా కష్టతరమని సీఎం వ్యాఖ్యానించారు.
Similar News
News October 8, 2024
నందిగం సురేశ్‌పై హత్య కేసు.. నేపథ్యమిదే.!
మాజీ MP నందిగం సురేశ్‌పై నమోదైన హత్య కేసులో సోమవారం రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. 2020లో వెలగపూడిలో 2వర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడిలో వృద్ధురాలు మృతిచెందింది. ఆ సమయంలో వృద్ధురాలి బంధువులు రోడ్డుపై బైఠాయించి.. ఘర్షణను నందిగం సురేశ్ ప్రోత్సహించారని, కేసు నమోదు చేయాలని ధర్నాకు దిగారు. అప్పుడు కేసు నమోదు కాగా, ఇటీవల మృతురాలి బంధువులు మరోసారి పోలీసులను ఆశ్రయించడంతో విచారణ వేగవంతమైంది.
News October 8, 2024
నేడు లేదా రేపు TDPలోకి మోపిదేవి వెంకటరమణ..?
YCP మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ నేడు లేదా రేపు TDP తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. సొంత నియోజకవర్గమైన రేపల్లె, విజయవాడలోని తన సామాజికవర్గ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయన TDP కండువా కప్పుకోనున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంలుగా ఉన్న హయాంలో మోపిదేవి మంత్రిగా పనిచేశారు. ఇటీవల ఆయన YCPకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
News October 8, 2024
తుళ్ళూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో ఘర్షణ
కుటుంబ కలహాల నేపథ్యంలో ఘర్షణ జరిగిన ఘటన తుళ్ళూరులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కంభంపాటి శేషగిరిరావు, పావని దంపతులు. కొంతకాలంగా అత్త, కోడలికి మధ్య వైరం నడుస్తోంది. ఈ క్రమంలో ఆదివారం కోడలి తరఫు బంధువులు, అత్తవైపు వారు గొడవ పడ్డారు. ఈ ఘర్షణలో కోడలు అత్త చెవి కొరకడంతో సగభాగం ఊడి కింద పడిపోయింది. గుంటూరు ఆస్పత్రికి తీసుకెళ్లినా అతికించలేమని వైద్యులు చెప్పారు.