News March 16, 2025
ఫొటో మార్పింగ్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన సీతక్క

సోషల్ మీడియాలో తన ఫొటో మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క శనివారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై తీవ్ర మానసిక క్షోభకు గురైనట్లు తెలిపారు. సోషల్ మీడియాలో అసభ్యకర భావజాల నియంత్రణకు నియంత్రణకు ప్రస్తుతం ఉన్న చట్టాలను మరింత కఠిన తరం చేయాలని సీతక్క అన్నారు.
Similar News
News March 16, 2025
సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన వరంగల్ సీపీ

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం శివునిపల్లి శివారు ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు హెలికాప్టర్లో సభాస్థలికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డిని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పాగుచ్ఛాన్ని సీఎంకు సీపీ అందజేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ ముఖ్యమంత్రితో సభాస్థలికి చేరుకున్నారు.
News March 16, 2025
విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చేప్పిన పల్నాడు కలెక్టర్

జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులందరూ ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు కోరారు. జిల్లాలో 463 పాఠశాల నుంచి మొత్తం 26,497 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. జిల్లాలో 128 పరీక్ష కేంద్రాలలో బాలురు 13,415 మంది బాలికలు 1,382 మంది ఉన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలన్నారు. జిల్లాలోని విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.
News March 16, 2025
రేపు ఓయూ బంద్కు ఏబీవీపీ పిలుపు

ఉస్మానియా యూనివర్సిటీలో ప్రదర్శనలు, నిరసనలపై నిషేధం విధిస్తూ ఓయూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా సోమవారం ఓయూ బంద్కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. యూనివర్సిటీల్లో నియంతృత్వ పోకడలు సరికాదని పేర్కొంది. ఓయూలో ఉద్యోగ భర్తీ, నిధుల కొరత, విద్య నాణ్యత, ఆహార నాణ్యత తదితరాంశాలపై దృష్టి సారించాలని అధికారులకు విజ్ఞప్తి చేసింది.