News March 16, 2025
ఫొటో మార్పింగ్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన సీతక్క

సోషల్ మీడియాలో తన ఫొటో మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క శనివారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై తీవ్ర మానసిక క్షోభకు గురైనట్లు తెలిపారు. సోషల్ మీడియాలో అసభ్యకర భావజాల నియంత్రణకు ప్రస్తుతం ఉన్న చట్టాలను మరింత కఠినతరం చేయాలని సీతక్క కోరారు.
Similar News
News September 18, 2025
మహబూబాబాద్: ఐదుగురు పీఏసీఎస్ ఛైర్మన్లను తొలగించిన ప్రభుత్వం

మహబూబాబాద్ జిల్లాలో ఐదుగురు పీఏసీఎస్ ఛైర్మన్లను ప్రభుత్వం తొలగించింది. తొర్రూరు, నెల్లికుదురు, బయ్యారం, కేసముద్రం, కురవి సొసైటీల ఛైర్మన్లను తొలగించి, వారి స్థానంలో ప్రత్యేక అధికారులను నియమించింది. తొర్రూరుకు రమేశ్, బయ్యారానికి ఆదినారాయణ, నెల్లికుదురుకు మోహన్ రావు, కేసముద్రానికి ప్రవీణ్, కురవికి సుమలత ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు స్వీకరించారు.
News September 18, 2025
సెప్టెంబర్ 18: చరిత్రలో ఈ రోజు

✒ 1883: ఫ్రీడమ్ ఫైటర్ మదన్ లాల్ ధింగ్రా(ఫొటోలో) జననం
✒ 1899: ఫ్రీడమ్ ఫైటర్, కవి గరికపాటి మల్లావధాని జననం
✒ 1950: నటి షబానా అజ్మీ జననం
✒ 1968: దక్షిణాది నటుడు ఉపేంద్ర జననం
✒ 1985: డైరెక్టర్ విజ్ఞేశ్ శివన్ జననం
✒ 1988: క్రికెటర్ మోహిత్ శర్మ జననం
✒ 1989: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప జననం
✒ ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం
✒ ప్రపంచ వెదురు దినోత్సవం
News September 18, 2025
జగిత్యాల: లైంగిక వేధింపుల కేసులో తహశీల్దార్ సస్పెండ్

జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండల తహశీల్దార్ బీ.రవీందర్ నాయక్ను కలెక్టర్ సత్యప్రసాద్ సస్పెండ్ చేశారు. 2 పడక గదుల ఇళ్ల దరఖాస్తుల సర్వే సమయంలో వార్డు అధికారిణిని ఆయన లైంగికంగా వేధించారనే ఆరోపణలతో ఇటీవల జగిత్యాల పట్టణ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అనంతరం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారణ జరిపి బుధవారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.