News March 19, 2025
ఫొటో సెషన్‌నే నా జీవితంలో మైలురాయి: MLA సింధూర

శాసనసభలో ఫొటో సెషన్ నా జీవితంలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర పేర్కొన్నారు. నియోజవర్గంలోని ప్రజల సమస్యలను సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని, బడ్జెట్ సమావేశాలు ముగింపు సందర్భంగా శాసన సభ్యులతో కలిసి దిగిన ఫొటో తన జీవితంలో మొదటి జ్ఞాపకంగా నిలిచిపోతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Similar News
News December 23, 2025
‘పల్లె వెలుగు’ బస్సులూ EV ACవే ఉండాలి: CBN

AP: RTCలో ప్రవేశపెట్టే బస్సులు, ‘పల్లెవెలుగు’ అయినా సరే ఎలక్ట్రికల్ ఏసీవే ఉండాలని CM CBN అధికారులను ఆదేశించారు. ‘వచ్చే ఏడాది కొనే 1450 బస్సులూ ఈవీనే తీసుకోవాలి. 8819 డీజిల్ బస్సుల స్థానంలో EVలనే పెట్టండి. 8 ఏళ్ల కాలపరిమితి దాటిన వాటినీ మార్చాలి. తిరుమల- తిరుపతి మధ్య రవాణాకు 300 ఈ-బస్సులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది’ అని వివరించారు. బస్సుల మెయింటెనెన్సును ప్రైవేటుకు అప్పగించాలని సూచించారు.
News December 23, 2025
నెల్లూరులో భారీగా పెరిగిన గుడ్డు ధర

నెల్లూరు జిల్లాలో ఓ ట్రే గుడ్లు(30) ధర కేజీ మాంసంతో పోటీపడుతోంది. మార్కెట్లో ఆల్ టైం రికార్డ్ సృష్టిస్తోంది. పౌల్ట్రీ చరిత్రలోనే ఇదే అత్యధికమని వ్యాపారులు వాపోతున్నారు. గతంలో రూ.5, రూ.6వరకు పలికిన గుడ్డు ధర ప్రస్తుతం రూ.8.5కు చేరింది. గతంలో 30 కోడిగుడ్లు రూ.160 నుంచి రూ.170 వరకు విక్రయించేవారు. 10రోజులుగా 30 గుడ్లను రూ.240 వరకు హోల్‌సేల్ మార్కెట్‌లోనే విక్రయిస్తున్నారు.
News December 23, 2025
పెద్దపల్లి: గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ కన్వెన్షన్ పోస్టర్ ఆవిష్కరణ

పెద్దపల్లిలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మెగా కన్వెన్షన్ పోస్టర్‌ను ఈ రోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ చాప్టర్ అధ్యక్షుడు వేల్పురి సంపత్ రావు మాట్లాడుతూ.. ఈ నెల 27, 28 తేదీలలో హైదరాబాదులోని గండిపేటలో గల అక్షయ కన్వెన్షన్‌లో ఈ కార్యక్రమం జరుగనుందని తెలిపారు. అసోసియేషన్ పెద్దపల్లి చాప్టర్ సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


