News February 8, 2025
ఫోక్సో కేసుల దర్యాప్తు వేగవంతం: బాపట్ల SP

ఫోక్సో కేసులను వేగవంతంగా దర్యాప్తు చేయాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి చెప్పారు. శుక్రవారం బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో డీపీఓలో విధులు నిర్వహించే సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సిబ్బంది పనితీరు మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలకు సంబంధించిన కేసులను 60 రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేయాలని అన్నారు. అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 4, 2025
ఉన్నవ లక్ష్మీనారాయణ.. సాహిత్య, సామాజిక విప్లవకారుడు.!

తెలుగు నవలా సాహిత్యానికి కొత్త దిశానిర్దేశం చేసిన ఉన్నవ లక్ష్మీనారాయణ (1877-1958) ఉమ్మడి గుంటూరు జిల్లా వేములూరుపాడులో జన్మించారు. న్యాయవాదిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా బహుముఖ ప్రజ్ఞ చాటారు. పల్నాడు పుల్లరి సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. సామాజిక రుగ్మతలను ఎదిరించి, దళితుల అభ్యున్నతికి ఆయన రాసిన ‘మాలపల్లి’ నవల ఒక విప్లవాత్మక సృష్టి.
News December 4, 2025
దీపం కొండెక్కింది అని ఎందుకు అంటారు?

దీపం ఆరిపోవడాన్ని మనం ‘దీపం కొండెక్కింది’ అని అంటాం. దీని వెనుక ఓ ఆధ్యాత్మిక కారణం ఉంది. సాధారణంగా మనం పర్వతాలను దైవ నివాసాలుగా భావిస్తాం. కొండలు దేవతలకు ఆశ్రయం ఇస్తాయని నమ్ముతాం. అయితే, దీపం జ్యోతి ఆరిపోయినప్పుడు, అది భౌతిక దేహాన్ని విడిచి, నేరుగా దైవంలో కలిసిపోయింది అని భావించాలి. దీపం దైవంలో ఐక్యమైందని చెప్పడానికే మనం ఆధ్యాత్మిక వ్యక్తీకరణను ఉపయోగిస్తూ ఇలా చెబుతుంటాం.
News December 4, 2025
SIM Bindingపై ఓటీటీలు, యాప్స్ అసంతృప్తి

OTTలు, వాట్సాప్ వంటి యాప్స్ పని చేయాలంటే ఫోన్లో యాక్టివ్ SIM ఉండాలన్న <<18424391>>DoT ఆదేశాలపై<<>> బ్రాడ్బ్యాండ్ ఇండియా ఫోరమ్(BIF) తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. అమలును నిలిపేయాలని, యూజర్లపై ప్రభావాన్ని అంచనా వేయకుండా ఉత్తర్వులివ్వడం సరికాదని పేర్కొంది. టెలికాం కంపెనీలు మాత్రం DoTని అభినందించాయి. SIM Bindingతో యూజర్, నంబర్, డివైజ్ మధ్య నమ్మకమైన లింక్ ఉంటుందని, స్పామ్, ఆర్థిక మోసాలను తగ్గించవచ్చని అన్నాయి.


