News February 8, 2025
ఫోక్సో కేసుల దర్యాప్తు వేగవంతం: బాపట్ల SP

ఫోక్సో కేసులను వేగవంతంగా దర్యాప్తు చేయాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి చెప్పారు. శుక్రవారం బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో డీపీఓలో విధులు నిర్వహించే సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సిబ్బంది పనితీరు మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలకు సంబంధించిన కేసులను 60 రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేయాలని అన్నారు. అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 19, 2025
సన్నబియ్యం కోసం చూస్తే దొడ్డు బియ్యం కూడా ఇవ్వలేదు: KTR

TG: సామాన్యులకు రేషన్ బియ్యం అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని KTR విమర్శించారు. ‘మార్చి నుంచి సన్నబియ్యం ఇస్తామన్న ప్రభుత్వం పదో తేదీ దాటినా రేషన్ బియ్యం ఇవ్వలేదు. సన్నబియ్యం కోసం చూస్తే కనీసం దొడ్డు బియ్యం కూడా రాలేదు. లక్ష 54 వేల మెట్రిక్ టన్నులకు గాను రేషన్ దుకాణాలకు కేవలం 62 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేసింది’ అని ట్వీట్ చేశారు. మీకు ఈనెల రేషన్ వచ్చిందా? COMMENT.
News March 19, 2025
జనగామ: ఇంటి వద్దకే భద్రాద్రి శ్రీ సీతారామ కళ్యాణ తలంబ్రాలు

జనగామ ఆర్టీసీ బస్సు డిపో కార్గో ద్వారా భక్తుల ఇంటివద్దకే శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాలు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు డిపో మేనేజర్ స్వాతి తెలియజేశారు. తలంబ్రాల బుకింగ్ కొరకు కార్గో లాజిస్టిక్స్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అవినాశ్, కార్గో ఏజెంట్ రూ.151 చెల్లించి రశీదు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఇంటి వద్దకు కార్గో ఏజెంట్ ద్వారా తలంబ్రాలు పంపిణీ చేస్తారని తెలిపారు.
News March 19, 2025
భూపాలపల్లి: కుష్టు వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి: వైద్యాధికారి

కుష్టు వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి డా.మధుసూదన్ పిలుపునిచ్చారు. మంగళవారం తన కార్యాలయంలో జరిగిన సమీక్షలో కుష్టి వ్యాధిపై పలు సూచనలు చేశారు. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈనెల 17 నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించే సర్వేకు సహకరించాలని కోరారు. వ్యాధిగ్రస్థులకు ప్రభుత్వం రూ.12 వేల చొప్పున అందిస్తుందన్నారు.