News January 29, 2025
ఫోటోగ్రపీలో కోనసీమ యువకుడు ప్రతిభ

ఈనెల 27,28 తేదీల్లో సఖినేటిపల్లి ప్రొఫెషనల్ ఫోటో,వీడియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్వర్యంలో కేశనపల్లి లో ఫోటోగ్రఫీ వర్క్ షాప్ నిర్వహించారు. ఇందులో రాజోలు మండలం పొదలాడ గ్రామానికి చెందిన కాకర రవితేజ తీసిన ఫోటోకు బంగారు పథకం లభించింది. రెండు రోజులపాటు జరిగిన ఈవర్క్ షాప్ లో సుమారు 40 మంది పాల్గొన్నారు. ఫోటో గ్రాపర్స్ అసోసియేషన్ నాయకులు రవితేజకు బంగారు పథకం అందజేశారు.
Similar News
News December 9, 2025
సంగారెడ్డి: నేటి నుంచి వైన్స్ దుకాణాల బంద్

జిల్లాలో ఈనెల 11న జరుగనున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా నేటి సాయంత్రం నుంచి 11వ తేదీ వరకు వైన్స్, బార్లు, రెస్టారెంట్లు మూసివేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు సోమవారం తెలిపారు. ఎన్నికలు జరిగే ప్రాంతాలలో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని అన్నారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 9, 2025
ఖమ్మం: సాయంత్రం నుంచి అంతా గప్ చుప్

జీపీ మొదటి విడత ప్రచారానికి ఇవాళ సాయంత్రంతో తెర పడనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఖమ్మం జిల్లాలో 7 మండలాల్లో 172, కొత్తగూడెం జిల్లాలో 8 మండలాల్లో 159 గ్రామాల్లో ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ పోరులో ఎప్పుడూ పెద్దగా కనిపించని బడా నేతలు సైతం ఈ ఎలక్షన్స్ను ప్రతిష్ఠాత్మకంగా భావించి తమ మద్దతు దారుల తరఫున ఓట్లు అభ్యర్థించారు.
News December 9, 2025
సిద్దిపేట: పొలంలో ఎన్నికల ప్రచారం

సిద్దిపేట జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎలక్షన్లో భాగంగా అభ్యర్థులు ఎవరికీ తోచినట్లుగా వారు ప్రచారం చేస్తున్నారు. నంగునూరు మండలం సిద్దన్నపేటలో సర్పంచ్ అభ్యర్థి బెదురు తిరుపతి వ్యవసాయ క్షేత్రంలో కూలీలు వారి నాటు వేస్తున్నారని తెలుసుకుని పొలం దగ్గరకి వెళ్లి మరి నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.


