News March 22, 2025
ఫోన్ చేసి సమస్యలు తెలపండి: నిర్మల్ కలెక్టర్

అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో మారుమూల ప్రాంతాల ప్రజల సహాయార్థం ప్రతి సోమవారం టెలిఫోన్ ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు ప్రజలు తమ ఇంటి నుంచే 91005 77132 నంబర్‌కు కాల్ చేసి నేరుగా తమ సమస్యలను తెలుపవచ్చన్నారు. అలాగే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టరేట్‌లో యథావిధిగా ప్రజావాణి కొనసాగుతుందన్నారు.
Similar News
News April 19, 2025
HYD: రివాల్యుయేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంసీఏ కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంసీఏ మెయిన్, బ్యాక్ లాగ్ పరీక్షలతో పాటు దూరవిద్య ఎంసీఏ పరీక్ష రివాల్యుయేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.800 చొప్పున చెల్లించి ఈ నెల 23వ తేదీలోగా టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రూ.200 అపరాధ రుసుముతో ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
News April 19, 2025
మొక్కలు నాటిన నారాయణపేట కలెక్టర్, ఎమ్మెల్యే

మరికల్ మండల కేంద్రంలో నూతనంగా ప్రారంభమైన ఇంటిగ్రేటెడ్ మండల కాంప్లెక్స్ కార్యాలయంలో శనివారం నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్ని రంగులతో నూతనంగా ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ మండల కాంప్లెక్స్‌ను అధికారులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎమ్మార్వో అనిల్ కుమార్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
News April 19, 2025
వనపర్తి కలెక్టర్‌కు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆదేశం

అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టిసారించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. శనివారం వీసీ ద్వారా మంత్రి నిర్వహించిన సమీక్షలో వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. రైతులు కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసే విధంగా కలెక్టర్లు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.