News April 7, 2025

ఫ్యామిలీతో బైరెడ్డి!

image

వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి శ్రీరామనవమి వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. తల్లిదండ్రులు, సోదరులతో కలిసి దిగిన గ్రూప్ ఫొటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. చాలా రోజుల తర్వాత బైరెడ్డి ఫ్యామిలీతో కనిపించడంతో అభిమానులు సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా ఇటీవల వైసీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యనిర్వహక అధ్యక్షుడిగా సిద్ధార్థ్‌ రెడ్డి నియమితులైన విషయం తెలిసిందే.

Similar News

News January 9, 2026

TUలో రేపటి నుంచి సంక్రాంతి సెలవులు

image

తెలంగాణ యూనివర్సిటీలో రేపటి నుంచి ఈ నెల 18 వరకు సెలవులు ప్రకటిస్తూ చీఫ్ వార్డెన్ ఆచార్య రవీందర్ రెడ్డి సర్కులర్ జారీ చేశారు. డిచ్‌పల్లిలోని మెయిన్ క్యాంపస్‌తో పాటు భిక్కనూరు సౌత్ క్యాంపస్, సారంగాపూర్ ఎడ్యుకేషన్ క్యాంపస్‌లకు సెలవులు ప్రకటించారు. విద్యార్థులు సంక్రాంతి సెలవుల అనంతరం పెండింగ్ మెస్ బిల్లులు చెల్లించి ఈ నెల 19న తరగతులకు హాజరు కావాలని సూచించారు.

News January 9, 2026

రీల్స్ వైరలా కావాలా? జూబ్లీహిల్స్ వచ్చేయండి!

image

మీరు తీసే ట్రావెల్ వీడియోలు వైరల్ అవ్వడం లేదని ఫీలవుతున్నారా? FTCCI టూరిజం కమిటీ ఆధ్వర్యంలో JAN 17న జూబ్లీహిల్స్‌లోని ‘క్రియేటర్ వర్స్’లో రీల్ మేకింగ్ బూట్‌క్యాంప్ జరుగుతోంది. ₹500లకే షూటింగ్, ఎడిటింగ్ ట్రిక్స్ నేర్చుకోవచ్చు. అద్భుతమైన రీల్స్ చేసి ₹50,000 నగదు బహుమతులు గెలుచుకునే ఛాన్స్ మీ సొంతం. మీ స్మార్ట్‌ఫోన్ తీయండి, క్రియేటర్ అయిపోండి! మరిన్ని వివరాలకు 98480 42020లో సంప్రదించండి.

News January 9, 2026

భూరికార్డులను ఎవరూ మార్చలేరు: చంద్రబాబు

image

AP: పాస్‌బుక్స్ పంపిణీ పవిత్రమైన కార్యక్రమమని CM చంద్రబాబు తెలిపారు. తూ.గో.జిల్లా రాయవరంలో ఆయన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ప్రాణం పోయినా రైతు భూమి కోల్పోయేందుకు అంగీకరించడు. సున్నితమైన అంశంతో పెట్టుకోవద్దని మాజీ CMకు చెప్పినా వినలేదు. కూటమి రాకపోయుంటే రైతుల భూములు గోవిందా గోవిందా. రాజముద్ర వేసి మళ్లీ పాస్‌బుక్స్ ఇస్తున్నాం. మీ భూరికార్డులను ఎవరూ మార్చలేరు. మోసం చేయలేరు’ అని స్పష్టం చేశారు.