News June 17, 2024

ఫ్యాషన్ డిజైనింగ్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

HYD నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్‌లో విద్యా సంవత్సరానికి డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమో కోర్సుల్లో చేరడానికి ఆసక్తి ఉన్నవారు ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ రాము యాదవ్ తెలిపారు.ఆర్థికంగా వెనుకబడిన వారికి మెరిట్ స్కాలర్ షిప్ టెస్ట్ ద్వారా ఫీజుల్లో రాయితీ కల్పించడానికి ఈ నెల 23న పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైనా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News October 6, 2024

GREAT.. జనగామ: ఒకే ఇంట్లో రెండు ప్రభుత్వ ఉద్యోగాలు

image

ఒకే ఇంట్లో అన్నా చెల్లెలు రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన బల్ల పద్మ-సోమయ్య కొడుకు మహేశ్ కుమార్, కూతురు మౌనికలు ఇటీవల విడుదలైన డీఎస్సీ(SGT) ఫలితాల్లో వరుసగా 5, 15వ ర్యాంక్‌లు సాధించారు. తండ్రి చిన్నప్పుడే చనిపోగా తల్లి బీడీలు చేసి వీరిని చదివించింది.

News October 6, 2024

మహాలక్ష్మి అలంకరణలో భద్రకాళి అమ్మవారు

image

ఓరుగల్లు ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. శరన్నవరాత్రుల్లో నాలుగో రోజు ఆదివారం భద్రకాళి అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో ఆలయ అర్చకులు అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు ఉదయాన్నే ఆలయానికి చేరుకొని ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు.

News October 6, 2024

ఉగాండాలో జనగామ జిల్లా వాసి దారుణ హత్య

image

జనగామ జిల్లా వాసిని ఉగాండాలో హత్య చేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. పట్టణానికి చెందిన తిరుమలేశ్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌గా ఉగాండాలోని ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పని చేస్తున్నారు. అక్కడే పని చేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు తాగిన మైకంలో తిరుమలేశ్‌పై కాల్పులు జరపడంతో ప్రాణాలు వదిలాడు. అనంతరం సెక్యూరిటీ గార్డు తనను తాను కాల్చుకొని మరణించాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.