News June 17, 2024
ఫ్యాషన్ డిజైనింగ్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

HYD నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్‌లో విద్యా సంవత్సరానికి డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమో కోర్సుల్లో చేరడానికి ఆసక్తి ఉన్నవారు ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ రాము యాదవ్ తెలిపారు.ఆర్థికంగా వెనుకబడిన వారికి మెరిట్ స్కాలర్ షిప్ టెస్ట్ ద్వారా ఫీజుల్లో రాయితీ కల్పించడానికి ఈ నెల 23న పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైనా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News December 24, 2025
కరీంనగర్: పత్తి రైతులకు విజ్ఞప్తి

జిల్లా పత్తి రైతులకు సీసీఐ వారు కాపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్ చేసి పత్తిని అమ్ముకొనే క్వింటాళ్ల నిబంధనలో మార్పు చేసినట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి తెలిపారు. ఈ నెల 25 అర్థరాత్రి నుంచి స్లాట్ బుకింగ్ చేసుకొన్న రైతులు గరిష్టంగా అదనంగా 5 క్వింటాళ్ళ పత్తిని విక్రయించడానికి అనుమతి ఇవ్వడమైనది. రైతులు పత్తి పరిమాణాన్ని నమోదు చేసుకొని పత్తి కొనుగోళ్ళకు సహకరించాలని కోరారు.
News December 24, 2025
సీపీఐ శతవసంతాల ముగింపు సభను విజయవంతం చేయండి: చాడ

భారత కమ్యూనిస్టు పార్టీ శతవసంతాల ఉత్సవాలలో బాగంగా జనవరి 18న ఖమ్మం పట్టణంలో నిర్వహించే ముగింపు సభను విజయవంతం చేయాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో బుధవారం విలేకర్లతో మాట్లాడారు. గడిచిన వందేళ్లలో పేదల పక్షాన నిలబడి ఎన్నో ప్రజా పోరాటాలు నిర్వహించిన కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుందన్నారు.
News December 24, 2025
KNR: దక్షిణాది స్థాయి ఈత పోటీలకు స్వరణ్, భువన్ ఎంపిక

హైదరాబాద్‌లో ఈనెల 27 నుంచి 29 వరకు జరిగే దక్షిణాది రాష్ట్రాల ఈత పోటీలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కంకణాల స్వరణ్, భువన్ ఎంపికయ్యారు. ఇటీవల ఆదిలాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో స్వరణ్ బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో రజత పతకం సాధించగా.. వాటర్ పోలో జట్టుకు భువన్ ఎంపికయ్యారు. వీరిని జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి కృష్ణమూర్తి, డీవైఎస్వో శ్రీనివాస్‌గౌడ్, కోచ్‌లు అభినందించారు.


