News June 20, 2024
ఫ్రీ కోచింగ్‌పై తొలి సంతకం చేసిన మంత్రి సవిత
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా సవిత బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె ఉచిత డీఎస్సీ కోచింగ్ ఫైల్‌పై మొదటి సంతకం చేశారు. ఎన్టీఆర్ విదేశీ విద్య పథకం కొనసాగింపుపై రెండవ సంతకం చేశారు. మంత్రి సవిత మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేశారని, ఆయన అడుగుజాడల్లో వెనకబడిన తరగతుల్లోని నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్‌పై తొలి సంతకం చేశానని తెలిపారు.
Similar News
News September 11, 2024
అనంత: విద్యార్థి హత్య కేసు ఛేదించిన పోలీసులు
ఆత్మకూరు మండలానికి చెందిన విద్యార్థి సరిత హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఇటుకలపల్లి సీఐ హేమంత్ కుమార్ తెలిపారు. మంగళవారం గుమ్మగట్ట మండలం వెంకటంపల్లికి చెందిన తిప్పేస్వామిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 2 సెల్ ఫోన్లు, వేటకొడవలి స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రేమించాలని యువతిని ఫోన్లో వేధించేవాడని, ఆమె అంగీకరించకపోవడంతో వెంటపడి హత్య చేసినట్లు విచారణలో తేలిందని వెల్లడించారు.
News September 11, 2024
వైద్య సేవలపై రోగులకు ఆరా తీసిన కలెక్టర్
అనంతపురంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మంగళవారం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని సిటీ స్కాన్, రక్త నిధి కేంద్రం, ఐసీయూ తదితర విభాగాలను ఆయన కలియ తిరుగుతూ సమగ్రంగా పరిశీలించారు. ఆసుపత్రిలోని సమస్యల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు బాగా అందిస్తున్నారని రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు.
News September 11, 2024
ఈ నెల 14 నుంచి స్వచ్ఛత హి సేవ కార్యక్రమాలు: కలెక్టర్
ఈ నెల 14 నుంచి సత్యసాయి జిల్లాలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ.. స్వభావ స్వచ్ఛత-సంస్కార్ స్వచ్ఛత పేరుతో హి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ ఆదేశాల మేరకు 14 నుంచి 17 వరకు సన్నద్ధత కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.