News March 7, 2025

ఫ్రీ బస్.. ప్రజల భిన్నాభిప్రాయాలు

image

ATP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘ఫ్రీ జర్నీ జిల్లా వరకే పరిమితం.. మీ కామెంట్’ అంటూ వే2న్యూస్ అనంతపురం జిల్లాలో వార్త <<15677166>>పబ్లిష్<<>> చేయగా ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పారు. 41శాతం మంది దీనిని స్వాగతించారు. మరికొందరు ఈ పథకం వద్దని, బస్సు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. వృద్ధులు, కాలేజ్ పిల్లల వరకు పరిమితం చేయాలని కొందరు కామెంట్ చేశారు.

Similar News

News March 20, 2025

అనంతపురం: 100% ఇంటింటి చెత్త సేకరణ.!

image

క్షేత్రస్థాయిలో 100% ఇంటింటి చెత్త సేకరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి SWPC షెడ్లు, GSWS అంశాలపై DPO, MPDO, మున్సిపల్ కమిషనర్లు, DLDO అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 56చోట్ల SWPC షెడ్లు పనిచేయడం లేదని.. వాటి బాధ్యత అధికారులపై ఉందన్నారు.

News March 19, 2025

టాటా ఇన్నోవేషన్ సెంటర్‌కు భూ సేకరణ: అనంత కలెక్టర్

image

రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు భూసేకరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం అనంతపురం నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయం వద్ద ఉన్న భూమి, సెంట్రల్ యూనివర్సిటీ అడ్మిన్ బిల్డింగ్‌ను ఆయన పరిశీలించారు. 24గంటల్లో స్థల పరిశీలన చేయాలని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి, సర్వే AD, MROలను కలెక్టర్ ఆదేశించారు.

News March 19, 2025

10th విద్యార్థులకు ఇబ్బందులు కలగొద్దు: కలెక్టర్

image

అనంతపురంలోని రాంనగర్ పరిధిలో ఉన్న శ్రీ చైతన్య ఇంగ్లిష్ మీడియం స్కూలులో పదో తరగతి పరీక్షలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును ఆయన పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

error: Content is protected !!