News August 13, 2024
ఫ్రెండ్‌తో బయటకెళ్లి.. అనుమానాస్పద స్థితిలో మృతి
ఉండిలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. భీమవరంలోని కందికట్లవారి వీధి వాసి నిఖిల్(25) ఇటీవల ముంబయి నుంచి వచ్చాడు. ఫ్రెండ్ పవన్‌తో ఆదివారం బయటకెళ్లిన నిఖిల్ రైల్వే ట్రాక్ వద్ద పడి ఉన్నట్లు పోలీసులకు ఫోన్ రాగా, వారు వెళ్లి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఆర్థిక వివాదాల కారణంగా పవనే హత్య చేశాడని నిఖిల్ తండ్రి ఆరోపిస్తున్నారు.
Similar News
News September 13, 2024
‘ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ జరగాలి’
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. శుక్రవారం గోదావరి సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లు, సంబధిత అధికారులతో ఆమె సమీక్షించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో సుమారు 5.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావచ్చని అంచనా ఉండగా అందులో సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు పటిష్ఠ ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలన్నారు.
News September 13, 2024
ఏలూరు జిల్లా బ్యాంకర్‌లకు కలెక్టర్ విజ్ఞప్తి
ఏలూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని, ప్రజలను ఆదుకోవాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి బ్యాంకర్‌లకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జిల్లాలో వరదల కారణంగా నష్టపోయిన రైతాంగం, ప్రజలకు రుణ సౌకర్యంపై బ్యాంకర్లతో ప్రత్యేక డీసీసీ సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భీమా క్లైముల పరిష్కారంలో రైతులను బ్యాంకుల చుట్టూ తిప్పుకోకుండా పరిష్కరించాలన్నారు.
News September 13, 2024
ప.గో.: గాంధీ తత్వంపై చిత్రలేఖనం పోటీలు
గాంధీ జయంతి సందర్భంగా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో చిత్రలేఖనం పోటీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సర్వోదయ మండలి ఉమ్మడి ప.గో.జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు మాట్లాడుతూ.. ‘గాంధీ తత్వం- నేటి భారతం’ అంశంపై ఏ4 సైజ్ డ్రాయింగ్ షీటుపై చిత్రం వేసి, స్కాన్ చేసి ispeducation@gmail.com మెయిల్‌కు ఈ నెల 21వ తేదీ లోపు పంపాలన్నారు.