News April 27, 2024

ఫ్లైఓవర్ బ్రిడ్జి మధ్యలో పడిన కారు.. డ్రైవర్ మృతి

image

చాగలమర్రి మండల పరిధిలోని జాతీయ రహదారి నగళ్లపాడు ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర నంద్యాల నుంచి కడపకు వెళ్లే దారిలో ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి మధ్యలో కారు పడింది. ప్రమాద స్థలంలోనే కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన డ్రైవర్ గండికోట చక్రపాణి మృతిచెందాడు. ఆళ్లగడ్డ రూరల్ సీఐ హనుమంతు నాయక్, చాగలమర్రి ఎస్సై అక్కడికి చేరుకుని పరిశీలించారు. క్రేన్ సహాయంతో కారును బయటకు తీసి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News October 16, 2025

కర్నూలులో మొట్టమొదటి ఈ-కోర్ట్ ప్రారంభం

image

రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిగా కర్నూలులో ఈ-కోర్ట్ ఏర్పాటు చేశారు. దీనిని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డా.పి.చంద్రశేఖర్ గురువారం ప్రారంభించారు. వైద్యులు, సిబ్బంది ఇక్కడి నుండే రాష్ట్రంలో ఏ కోర్టుకైనా సాక్ష్యాన్ని అందించవచ్చని చెప్పారు. దీని ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలిపారు.

News October 16, 2025

కర్నూలుకు వస్తున్నా.. తెలుగులో మోదీ ట్వీట్

image

ప్రధాని నరేంద్ర <<18018303>>మోదీ<<>> తన ఆంధ్రప్రదేశ్ పర్యటనపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకొని, అనంతరం కర్నూలులో రూ.13,400 కోట్ల విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటానని తెలిపారు. విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమల వంటి పలు రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఈ పర్యటనలో భాగమని పేర్కొన్నారు.

News October 16, 2025

రూ.13,429 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు

image

కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ భారీ ఎత్తున ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలను చేపట్టనున్నారు. మొత్తంగా రూ.13,429 కోట్ల మేర అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. వీటిల్లో రూ.9,449 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేయనుండగా.. రూ.1,704 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. రూ.2,276 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు.