News June 23, 2024

ఫ్లై ఓవర్ నిర్మాణానికి భూమి పూజ.. కోమటిరెడ్డి, గుత్తా రాక

image

చిట్యాలలో హైవే ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆదివారం ఆర్టీసీ బస్టాండ్ వద్ద భూమి పూజ కార్యక్రమం జరగనుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ కార్యక్రమానికి రానున్నారు.

Similar News

News November 17, 2025

నల్గొండలో నూతన డిజిటల్ లైబ్రరీ ప్రారంభం

image

58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నూతన డిజిటల్ లైబ్రరీని ప్రారంభించారు. రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు. డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్ ఈ డిజిటల్ లైబ్రరీని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రటరీ బాలమ్మ, గాదే వినోద్ రెడ్డి, ప్రమీల సహా జిల్లా గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.

News November 17, 2025

GREAT.. కనగల్ నుంచి నేషనల్ పోటీలకు..

image

కనగల్ మండలం జి.యడవల్లి హైస్కూల్ టెన్త్ క్లాస్ విద్యార్థిని పి. దీక్షిత అండర్- 17 బాలికల జాతీయ హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైంది. ఇటీవల నారాయణపేట జిల్లా కోస్గిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో దీక్షిత ప్రతిభ కనబరిచింది. ఈనెల 25 నుంచి 29 వరకు కర్ణాటకలోని తుములూరులో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననుందని పాఠశాల హెచ్ఎం విజయలక్ష్మి, పీడీ నారాయణ కవిత తెలిపారు.

News November 16, 2025

జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయం: మంత్రి కోమటిరెడ్డి

image

సమాజ సమస్యలను ధైర్యంగా ప్రజల ముందుకు తెస్తూ, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్న జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎక్స్‌పీరియం ఎకో పార్కులో జరిగిన జర్నలిస్టుల కుటుంబాల గెట్-టు-గెదర్‌లో ఆయన పాల్గొన్నారు. ప్రజాసేవలో నిరంతరం శ్రమిస్తున్న మీడియా మిత్రుల పట్ల తనకు గౌరవం, కృతజ్ఞతలు ఉన్నాయని మంత్రి తెలిపారు.