News January 31, 2025

ఫ్లోర్ లీడర్‌గా పిల్లి సుభాష్ చంద్రబోస్

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా నేతకు మాజీ సీఎం జగన్ మరోసారి కీలక పదవి ఇచ్చారు. ఇప్పటి వరకు రాజ్యసభలో వైసీపీ ఫ్లోర్ లీడర్‌గా విజయసాయి రెడ్డి ఉన్నారు. ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేయడంతో ఆ పదవి ఖాళీగా ఉంది. దీంతో రామచంద్రాపురానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబాస్‌ను వైసీపీ ఫ్లోర్ లీడర్‌గా జగన్ ఎంపిక చేశారు. రాజ్యసభలో జరిగే అన్ని సమావేశాలకు వైసీపీ తరఫున సుభాష్ చంద్రబోస్ హాజరవుతారు.

Similar News

News February 11, 2025

నగరి ఎమ్మెల్యే సోదరుడు వైసీపీలో చేరికకు బ్రేక్!

image

టీడీపీ నేత, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ సోదరుడు గాలి జగదీశ్ వైసీపీలో చేరికకు తాత్కాలిక బ్రేక్ పడింది. రేపు వైసీపీలో చేరేందుకు మాజీ సీఎం జగన్‌తో వైసీపీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. గాలి జగదీశ్ చేరికకు మాజీ మంత్రి రోజా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఆయన చేరికను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో జగదీశ్ నగరి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

News February 11, 2025

రంగరాజన్‌పై దాడిని ఖండించిన చంద్రబాబు

image

AP: చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడిని సీఎం చంద్రబాబు ఖండించారు. నాగరిక సమాజంలో హింసకు తావులేదని హితవు పలికారు. గౌరవప్రదమైన చర్చలు, భిన్నాభిప్రాయాలకు స్థానం ఉండాలి కానీ హింసకు కాదని వ్యాఖ్యానించారు. కాగా ఇటీవల రంగరాజన్‌పై దాడిని టీజీ సీఎం రేవంత్, కేటీఆర్, పవన్ కళ్యాణ్ తదితర రాజకీయ ప్రముఖులు ఖండించిన విషయం తెలిసిందే.

News February 11, 2025

విశాఖ: పదో తరగతి పరీక్షకు 29,997 మంది

image

విశాఖలో మార్చి 17 నుంచి ఏప్రిల్ ఒక‌టో తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న‌ ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌కు ప‌టిష్ట ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను జిల్లా ఇన్ఛార్జి రెవెన్యూ అధికారి సీతారామారావు ఆదేశించారు.మంగళవారం ఆయన అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడారు.విశాఖలో 134 కేంద్రాల్లో రెగ్యుల‌ర్ విద్యార్థులు 28,523, ఓపెన్ విద్యార్థులు 1,404 మొత్తం 29,997 మంది హాజ‌ర‌వుతున్నార‌ని డీఈవో ప్రేమ కుమార్ తెలిపారు.

error: Content is protected !!