News December 13, 2024
బంగారం అపహరించిన దొంగలను పట్టుకున్న కరీంనగర్ పోలీసులు
బంగారం అపహరించిన దొంగలను కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు. జగిత్యాల జిల్లా కథలపూర్ మండలం బొమ్మన గ్రామానికి చెందిన హేమశ్రీ బుధవారం కరీంనగర్లో పెళ్లి వేడుకకు హాజరై తిరుగు ప్రయాణంలో 10 తులాల బంగారు ఆభరణాల కలిగిన బ్యాగును పొగొట్టుకుంది. KNR పోలీసులు చాకచక్యంగా దొంగను పట్టుకొని బాధితురాలికి బంగారాన్ని అందజేశారు. ఇన్స్పెక్టర్ కోటేశ్వర్, క్రైమ్ కానిస్టేబుళ్లు కుమార్, సంపత్లను సిపి అభినందించారు.
Similar News
News December 27, 2024
మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించిన మంత్రి పొన్నం
భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారతదేశం ఆర్థికవేత్త, నిరాడంబరి, దేశం ఒక గొప్ప మహోన్నత వ్యక్తిని కొల్పోయిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
News December 27, 2024
వేములవాడ: గోవులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్
రాజన్న గోవులపై ప్రత్యేకశ్రద్ధ వహించాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. వేములవాడ మండలం తిప్పాపూర్లోని గోశాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. గోశాలలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సివిల్ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గోవుల సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పేర్కొన్నారు.
News December 27, 2024
మన్మోహన్ సింగ్తో జ్ఞాపకాన్ని పంచుకున్న మాజీ మంత్రి
భారతదేశ ఆర్థిక సంస్కరణలకు దూరదృష్టి గల నాయకుడు మన్మోహన్ సింగ్ మృతి చెందడం బాధాకరమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా వారి మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి వారు చేసిన సేవలు తరతరాలు గుర్తుండి పోతాయన్నారు. గతంలో వారితో కలిసిన ఫొటోను సోషల్ మీడియా ద్వారా మాజీ మంత్రి పంచుకున్నారు.