News January 26, 2025
బంగారుపాలె: లోయలోకి దూసుకెళ్లిన లారీ

బంగారుపాలెం మండలం మొగిలి ఘాట్ వద్ద కాసేపటి క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కంటైనర్ అదుపుతప్పి లోయలోకి దూసుకుపోవడంతో ఒకరు మృతి చెందారు. బెంగళూర్ నుంచి చిత్తూరు వైపు వస్తున్న కంటైనర్ అతివేగంగా రావడంతో అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Similar News
News February 13, 2025
చిత్తూరు: ‘బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు పెంపు’

బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువును ఈనెల 15 వరకు పొడిగిస్తున్నట్లు బుధవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. లబ్ధిదారుల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకుని దరఖాస్తుల గడువు పెంచినట్లు పేర్కొన్నారు. అర్హులైన నిరుద్యోగ యువత స్వయం ఉపాధి యూనిట్ల స్థాపన కోసం దరఖాస్తులు ఈ నెల 15 లోపు అప్లై చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
News February 13, 2025
చిత్తూరు నేతలకు కీలక పదవులు ఇచ్చిన జగన్

చిత్తూరు పట్టణ వైసీపీ అధ్యక్షుడిగా కే.పీ. శ్రీధర్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే చిత్తూరు రూరల్ అధ్యక్షుడిగా జయపాల్, గుడిపాల మండల అధ్యక్షుడిగా జై ప్రకాశ్‌ని నియమించారు. తమకు అవకాశం కల్పించిన జగన్, విజయనందరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషిచేస్తామని తెలిపారు.
News February 12, 2025
బైరెడ్డిపల్లి: మహిళపై అత్యాచారయత్నం

బైరెడ్డిపల్లి ఎన్టీఆర్ కాలనీలోని ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మహిళపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పరశురాముడు తెలిపారు. బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై అదే కాలనీకి చెందిన నాగరాజు అత్యాచారయత్నానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.