News February 9, 2025
బంగారుపాల్యం: ప్రాణం తీసిన ఈత సరదా

ఈత సరదా ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటన బంగారుపాల్యం మండలం మొగిలిలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఫిబ్రవరి 7న సెల్వరాజ్ స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లాడు. ఈత రాకపోయిన చెరువులో దిగడంతో గల్లంతయ్యాడు. రెండు రోజులు సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో అగ్నిమాపక దళం తీవ్రంగా శ్రమించి మృతదేహాన్ని చెరువు నుంచి ఆదివారం వెలికి తీశారు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News March 28, 2025
ఆర్మీలో ఉద్యోగావకాశాలు: చిత్తూరు కలెక్టర్

ఆర్మీలో ఉద్యోగాలపై చిత్తూరు కలెక్టర్ కీలక ప్రకటన చేశారు. గుంటూరులో అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఉద్యోగాలకు మార్చి 15 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు www.joinindianarmy.nic.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుకు ఏప్రిల్ 10 చివరి తేదని కలెక్టర్ వెల్లడించారు.
News March 28, 2025
చిత్తూరు: ఖాళీ స్థానాలకు ఎన్నికలు

చిత్తూరు జిల్లాలో మండల పరిషత్‌లో ఖాళీగా ఉన్న స్థానాలకు గురువారం ఎన్నికలు జరిగాయి. సదుం ఎంపీపీగా మాధవి, పెనుమూరు కో-ఆప్షన్ సభ్యురాలిగా నసీమా, రామకుప్పం ఎంపీపీగా సులోచనమ్మ, వైఎస్ ఎంపీపీగా వెంకటే గౌడ, విజయపురం వైస్ ఎంపీపీగా కన్నెమ్మ, తవణంపల్లి ఎంపీపీగా ప్రతాప్ సుందర్ ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.
News March 27, 2025