News August 28, 2024

బంగారుపాళ్యం: ‘సీఐ భార్యకు బాలేదు.. నగదు పంపండి’

image

‘సీఐ భార్య అనారోగ్యంతో బాధపడుతున్నారు.. అత్యవసరంగా నగదు పంపండి’ అంటూ ఓ ఏఎస్సై పేరిట ఫోన్ చేసి వ్యాపారిని బురిడీ కొట్టించారు సైబర్ మోసగాళ్లు. వారు చెప్పిన విధంగా స్కానరుకు రూ. 95 వేల నగదు పంపి మోసపోయారు. ఈ ఘటన బంగారుపాళ్యంలో మంగళవారం వెలుగుచూసింది. ఇది మోసం అని గ్రహంచిన బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు విచారణ చేపట్టారు.

Similar News

News January 5, 2026

కుప్పంలో సత్ఫలితాలు ఇస్తోన్న CM విజన్.!

image

CM చంద్రబాబు ప్రత్యేక చొరవతో రాష్ట్రీయ ఆరోగ్య మిషన్ ద్వారా కుప్పంలో అమలు చేసున్న లింగ నిర్ధారిత వీర్యం ఇంజెక్షన్లు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఎదకొచ్చిన ఆవులకు లింగ నిర్ధారిత వీర్యం ఇంజెక్షన్లు వేస్తున్నారు. దీంతో కుప్పం(M) నూలుకుంటలో కృష్ణమూర్తికి చెందిన ఆవుకు ఉచిత ఫిమేల్ సీమెన్ పంపిణీ చేసి వేశారు. దీంతో ఆవు ఒకే ఈతలో రెండు దూడలకు జన్మనివ్వడంతో కృష్ణమూర్తి ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

News January 5, 2026

పుంగనూరు: నేడు మొదటి గ్రీవెన్స్ సెల్

image

అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలో కలెక్టర్ నిశాంత్ కుమార్ తొలి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. తమ సమస్యలపై బాధితులు అర్జీలు సమర్పించవచ్చని వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. జిల్లా కలెక్టరేట్‌కు వచ్చే అవసరం లేకుండా https://meekosam.ap.gov.in ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చన్నారు.