News March 28, 2025

బంగారు కవచాలతో భద్రాద్రి రామయ్య దర్శనం

image

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారు శుక్రవారం సందర్భంగా బంగారు కవచాలతో భక్తులకు దర్శనమిచ్చారు. ఉపాలయంలో వేంచేసి ఉన్న లక్ష్మీతాయారు అమ్మవారికి విశేషాలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి బేడా మండపంలో సంధ్యా హారతులు, ఉత్సవాన్ని జరపనున్నారు. ఈ అభిషేకంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, తిలకించారు.

Similar News

News October 22, 2025

నెల్లూరు జిల్లాలో రేపు కూడా సెలవు

image

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈక్రమంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలకు గురువారం సైతం కలెక్టర్ హిమాన్షు శుక్లా సెలవు ప్రకటించారు. ఈ ఉత్తర్వులను విధిగా అమలుచేయాలని కలెక్టర్ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ సైతం సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే.

News October 22, 2025

పోషకాల నిలయం.. BPT-2858 ఎర్ర వరి రకం

image

అత్యంత పోషక విలువలు గల BPT-2858 ఎర్ర బియ్యం రకాన్ని బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం అభివృద్ధి చేసింది. ఇది త్వరలో మార్కెట్‌లోకి రానుంది. దీని పంట కాలం 135 రోజులు. దిగుబడి హెక్టారుకు ఆరు టన్నులు. మధుమేహం, గుండెజబ్బులు, క్యాన్సర్‌ రాకుండా రోగ నిరోధక శక్తి వృద్ధి చేయడంలో ఈ రకం కీలకపాత్ర పోషిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు.
* రోజూ అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News October 22, 2025

యూడైస్‌లో పేరుంటేనే ఇంటర్ పరీక్షలకు!

image

TG: యూడైస్‌(యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫమేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్) నిబంధన ఇంటర్ విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇందులో పేరు నమోదు తప్పనిసరని, అలా ఉంటేనే ఇంటర్ పరీక్షలకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. యూడైస్‌లో పేరు లేకుంటే ఎగ్జామ్ ఫీజు కట్టేందుకు వీలు ఉండదు. ఇప్పటివరకు 75% విద్యార్థుల పేర్లు నమోదవ్వగా మరో 25% పెండింగ్‌లో ఉన్నాయి. ఆధార్ తప్పుల సవరణ దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు.