News December 30, 2024

బంగారు దొంగలించిన ముగ్గురు ముద్దాయిల అరెస్టు

image

గోరంట్ల: ఇటీవల జరిగిన దొంగతనం పాల్పడిన దొంగలను ఎట్టికేలకు పట్టుకొని వారి వద్ద నుంచి 12 తులాల బంగారు నగలు, బైక్‌ను స్వాధీనం చేసుకుని ముద్దాయిలను అరెస్టు చేశామని సీఐ బోయ శేఖర్ తెలిపారు. ఈ మేరకు వివరాలను మీడియాకు వివరించారు. వీరు కొంత కాలంగా తాళాలు వేసిన ఇళ్లల్లో దొంగతనాలతో పాటు ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ పలు దోపిడీలకు పాల్పడినట్లు తేలిందని వెల్లడించారు.

Similar News

News January 14, 2025

రాప్తాడు: కిలో టమాటా ధర రూ.9

image

అనంతపురం జిల్లాలోని కక్కపల్లి టమాటా మార్కెట్‌లో KG టమాటా ధర రూ.9గా ఉంది. సోమవారం కక్కపల్లి మార్కెట్‌కు 1050 టన్నుల టమాటా వచ్చినట్లు యార్డ్ కార్యదర్శి రాం ప్రసాద్ రెడ్డి తెలిపారు. అయితే టమాటాకు ప్రసిద్ధి చెందిన అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి మార్కెట్‌లో సోమవారం KG టమాటా ధర రూ.14 పలికినట్లు మార్కెటింగ్ సూపర్‌‌వైజర్ తెలిపారు.

News January 14, 2025

వైసీపీ శ్రీ సత్యసాయి జిల్లా సెక్రటరీగా భాస్కర్

image

వైసీపీ శ్రీ సత్యసాయి జిల్లా సెక్రటరీగా ముదిగుబ్బ మండలానికి చెందిన సీనియర్ నాయకుడు భాస్కర్‌ను అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు ఆయన సోమవారం మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. తన మీద నమ్మకముంచి జిల్లా సెక్రటరీగా ఎంపిక చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

News January 14, 2025

రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చు: ఎస్పీ

image

రోడ్డు భద్రతా నియమాలు పాటించడం, స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దాదాపుగా రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చని అనంతపురం ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు. హెల్మెట్/ సీటుబెల్టు ధరించడంతో పాటు త్రిబుల్ రైడింగ్, ఓవర్లోడింగ్, డ్రంకన్ డ్రైవ్, తదితర ఉల్లంఘనలకు దూరంగా ఉండాలన్నారు. మోటారు వాహనాల చట్ట ప్రకారంగా గడిచిన వారం రోజుల్లో 2,881 కేసులు నమోదు చేశామన్నారు.