News February 9, 2025
బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు: కలెక్టర్

మాదక ద్రవ్యాలకు బానిసై బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. రైజ్ కళాశాల, టెక్ బుల్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఒంగోలులో 5K రన్ నిర్వహించారు. క్యాన్సర్‌పై అవగాహన, మాదకద్రవ్యాల నివారణ కోసం ఈ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మినీ స్టేడియం వద్ద ప్రారంభమైన ఈ పరుగు మినీ స్టేడియం వద్ద ముగిసింది
Similar News
News March 22, 2025
రైతులు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి: జేసీ

జిల్లాలో 90 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. వాటిని రైతులు వినియోగించుకోవాలని కోరారు. కందులకు రూ.7,550, శనగలకు రూ.5,650, మినుములకు రూ.7,400 చొప్పున కనీస మద్దతు ధర ప్రకటించామన్నారు. బహిరంగ మార్కెట్‌లో కనీస మద్దతు ధర కంటే తక్కువ ఉన్నప్పుడు కొనుగోలు కేంద్రాలలో తమ ధాన్యాన్ని రైతులు విక్రయించి, ప్రభుత్వ కనీసం మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.
News March 22, 2025
ప్రకాశం: బెట్టింగ్ వేయకండి.. కాల్ చేయండి

ఐపీఎల్ వినోదం ఇవాళ్టి నుంచే మొదలు కానుంది. ఈక్రమంలో బెట్టింగ్ భూతం భయపడుతోంది. ఒంగోలు నగరంతో పాటు మారుమూల పల్లెల్లోని యువతను సైతం బెట్టింగ్‌లోకి లాగడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలో పోలీసులు నిఘా పెంచారు. ఎక్కడైనా బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిస్తే ఎవరైనా సరే 100, 112 నంబర్లతో పాటు 91211 02266కు కాల్ చేయాలని ఎస్పీ దామోదర్ కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బెట్టింగ్ జోలికి వెళ్లకండి.
News March 22, 2025
ఒంగోలు: క్రికెట్ బెట్టింగ్స్‌తో జీవితాలు నాశనం చేసుకోవద్దు: ఎస్పీ

క్రికెట్ బెట్టింగుల జోలికి వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రకాశం ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో క్రికెట్ బెట్టింగుల నిర్వాహకులు, పందెపు రాయుళ్లపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. క్రికెట్ బెట్టింగులకు పాల్పడినా, నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. యువత బెట్టింగుల జోలికి వెళ్లకుండా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు.