News February 13, 2026

బంగ్లాదేశ్ ఎన్నికలు.. BNP ఘనవిజయం

image

బంగ్లాదేశ్ ఎన్నికల్లో తారిఖ్ రెహ్మాన్‌కు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(BNP) కూటమి ఘన విజయం సాధించింది. 299 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 209 సీట్లు సొంతం చేసుకుంది. ప్రధాన పోటీదారు అనుకున్న జమాతే ఇస్లామీ పార్టీ వైపు ఓటర్లు మొగ్గు చూపలేదు. దీంతో ప్రధానిగా తారిఖ్ బాధ్యతలు చేపట్టనున్నారు. కొన్ని గంటల్లో అధికారికంగా ఫలితాలు వెల్లడించనున్నారు.

Similar News

News March 11, 2026

ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే?

image

ప్రెగ్నెన్సీలో ఉమ్మనీరు బిడ్డకు కవచంలా ఉంటూ ఇన్‌ఫెక్షన్లు సోకకుండా రక్షిస్తుంది. ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే అమ్మకు ఆయాసం ఎక్కువవుతుంది. ఏడో నెల తర్వాతయితే మరింత ఇబ్బంది అవుతుంది. నొప్పులు తొందరగా వస్తాయి. నిర్ణీత కాలం కంటే ముందుగానే ప్రసవం అయిపోతుంది. ఒక్కోసారి బేబీ చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఉమ్మనీరు ఎంత ఉందో చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

News March 11, 2026

టీమ్ ఇండియాపై పాక్ మాజీ క్రికెటర్ ప్రశంసలు

image

T20WCలో భారత్ తమకు అనుకూలంగా పిచ్‌లను తయారుచేసుకుందనే ఆరోపణలను పాక్ మాజీ క్రికెటర్ ఇమాద్ వసీమ్ ఖండించారు. ‘ఇండియా ఫ్రెండ్లీ పిచ్‌లు తయారుచేసుకుందని లేదా అంపైర్లు వారికి అనుకూలంగా వ్యవహరించారని చాలా మంది అంటుంటారు. కానీ ఈ టోర్నమెంటులో పిచ్‌లు చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాయి. కొన్నిసార్లు పరిస్థితులు ఇండియాకు ప్రతికూలంగా ఉన్నా మంచి ఆటతీరు కనబరిచారు. వాళ్లు మనకంటే చాలా బాగా ఆడారు’ అని ప్రశంసించారు.

News March 11, 2026

NLC ఇండియా లిమిటెడ్‌లో 16 పోస్టులు

image

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్(NLC) ఇండియా లిమిటెడ్‌ 16 హెల్త్ ఇన్‌స్పెక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అర్హులకు ఇంటర్/డిప్లోమా(శానిటరీ ఇన్‌స్పెక్టర్‌)/బ్యాచిలర్ డిగ్రీ/పీజీ డిప్లోమాతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలని పేర్కొంది. వయసు 30 ఏళ్లు దాటకూడదు. వేతనం రూ.38 వేలు. రాత పరీక్షతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు 02-04-2026 చివరి తేదీ. మరిన్ని వివరాలకు www.nlcindia.in చూడండి.