News August 16, 2024

బంగ్లాదేశ్ సంక్షోభం.. సిరిసిల్లకు అవకాశం!

image

బంగ్లాదేశ్‌లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం సిరిసిల్ల నేతన్నలకు అవకాశంగా మారింది. సంక్షోభంతో ఆ దేశంలోని టెక్స్టైల్ రంగంపై ప్రభావం పడింది. అక్కడికి వస్త్రోత్పత్తుల ఆర్డర్లు ఇచ్చే అంతర్జాతీయ సంస్థలు మనదేశం వైపు చూస్తున్నాయి. చెన్నై, మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత మరమగ్గాలపై వస్త్రోత్పత్తులకు సిరిసిల్ల ప్రసిద్ధిచెందింది. దీంతో ఇక్కడికి ఆర్డర్లు రానున్నట్లు తెలుస్తోంది. కాగా సిరిసిల్లలో 30వేల మరమగ్గాలున్నాయి.

Similar News

News September 16, 2024

ఉమ్మడి కరీంనగర్‌లో పట్టాలెక్కిన ‘వందేభారత్’

image

నాగపూర్- సికింద్రాబాద్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఎట్టకేలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వందేభారత్ ట్రైన్ పట్టాలెక్కింది. ఈ ట్రైన్ రామగుండం నుంచి సికింద్రాబాద్‌కు కేవలం 3 గంటల్లో చేరుకుంటుదని అధికారులు తెలిపారు. మంగళవారం మినహా మిగతా రోజుల్లో ఈ సర్వీస్ నడవనుంది. అయితే సికింద్రాబాద్‌ నుంచి రామగుండం వరకు ఏసీ చైర్‌కార్‌లో రూ.865 కాగా ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్‌లో రూ.1,510గా ధర నిర్ణయించారు.

News September 16, 2024

కరీంనగర్: రూ.5 లక్షల బీమాపై వృద్ధుల హర్షం

image

70 ఏళ్లు పైబడిన వారికి వైద్యం కోసం రూ.5 లక్షల ప్రత్యేక బీమా కల్పిస్తామని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని వృద్ధులు కేంద్రం నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంలో ఇద్దరు వృద్ధులు ఉన్నప్పటికీ ఈ బీమా వర్తించనుంది. కాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాల పరిధిలో 70 ఏళ్లు పైబడిన వృద్ధులు రూ.2 లక్షల మందికిపైగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.

News September 16, 2024

KNR: ట్రాక్టర్ నడిపిన బండి సంజయ్

image

ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనం జరుపుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన కరీంనగర్ మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వినాయక శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన శోభయాత్ర ర్యాలీలో ట్రాక్టర్‌ను నడిపి సరదాగా గడిపారు. ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు.