News January 25, 2025
బంజారాహిల్స్లో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

బంజారాహిల్స్లో రోడ్డు ప్రమాదం జరిగింది. క్యాన్సర్ ఆస్పత్రి వద్ద ఫుట్పాత్ మీదకు కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడే నిద్రిస్తున్న ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కారును వదిలిపెట్టి అందులో ఉన్నవారు పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్ వద్దకు చేరుకున్నారు. బాధితులను ఆస్పత్రికి తరలించారు. కారు నంబర్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 8, 2025
మూవీ ముచ్చట్లు

✦ ఈ నెల 12నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్న దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘కాంత’
✦ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్ నివేదా థామస్ సోదరుడు.. ‘బెంగళూరు మహానగరంలో బాలక’ సినిమాతో హీరోగా ఎంట్రీ.. పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్
✦ ఈ నెల 19న థియేటర్లలో రిలీజ్ కానున్న అగస్త్య నరేశ్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ‘గుర్రం పాపిరెడ్డి’
News December 8, 2025
ఘోర అగ్నిప్రమాదంలో తాడేపల్లిగూడెం యువకుడి మృతి

అమెరికాలోని బర్మింగ్ హామ్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. అందులో తాడేపల్లిగూడేనికి చెందిన అన్వేష్ రెడ్డి ఒకరు. ఘటనలో తీవ్రగాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కాగా వీరి కుటుంబం HYDలోని కూకట్ పల్లిలో నివాముంటోంది.
News December 8, 2025
విజయవాడ: ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చర్లపల్లి(CHZ)- షాలిమార్(SHM)(నం.07148,49) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి 9.35 గంటలకు CHZలో బయలుదేరే ఈ ట్రైన్ 9వ తేదీన ఉదయం 3.20కి విజయవాడ, రాత్రి 11.50 గంటలకు SHM చేరుకుంటుందన్నారు, 10న మధ్యాహ్నం 12.10కి SHMలో బయలుదేరి 11న ఉదయం 7.40కి విజయవాడ, సాయంత్రం 4 గంటలకు చర్లపల్లి చేరుకుంటుందన్నారు.


