News January 25, 2025
బంజారాహిల్స్‌లో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

బంజారాహిల్స్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. క్యాన్సర్ ఆస్పత్రి వద్ద ఫుట్‌పాత్ మీదకు కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడే నిద్రిస్తున్న ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కారును వదిలిపెట్టి అందులో ఉన్నవారు పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్ వద్దకు చేరుకున్నారు. బాధితులను ఆస్పత్రికి తరలించారు. కారు నంబర్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 8, 2025
కాంగ్రెస్ దుస్థితి: జీరో, జీరో.. మరో జీరో లోడింగ్!

ఢిల్లీ అసెంబ్లీకి 1952-2020 మధ్య ఎనిమిదిసార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 4సార్లు గెలిచింది. అలాంటి పార్టీ ఇప్పుడు అక్కడ ఖాతా తెరవడానికి ఆపసోపాలు పడుతోంది. 2015, 2020 ఎన్నికల్లో సున్నాకే పరిమితమైన గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఈసారీ పేలవ ప్రదర్శన చేస్తోంది. కేవలం ఒకేఒక్కచోట స్వల్ప ఆధిక్యతతో ఊగిసలాడుతోంది. పూర్తి కౌంటింగ్ ముగిసే సమయానికి ఆ స్థానమూ డౌటేనని అంచనా. దీంతో హ్యాట్రిక్ డకౌట్ ఖాయంగా కనిపిస్తోంది.
News February 8, 2025
క్లినికల్ అప్రెంటిస్ షిప్ శిక్షణకు దరఖాస్తు చేసుకోండి:DIEO

ఇంటర్‌లో MPHW (ఫీమేల్) కోర్సు ఉత్తీర్ణులైన వారు ఏడాది క్లినికల్ అప్రెంటిస్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని DIEO రవిబాబు సూచించారు. ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఇచ్చే శిక్షణకు ఎంపికైన వారు రూ.వెయ్యి డీడీ అందజేయాల్సి ఉంటుందని, గతంలో దరఖాస్తు చేసుకుని ఎంపిక కాని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి ఉన్న వారు బయోడేటాతో దరఖాస్తులను కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో ఈనెల 15లోగా అందజేయాలన్నారు.
News February 8, 2025
ఊరుకొండ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఊరుకొండ మండలంలోని ఇప్పపహాడ్ గ్రామానికి చెందిన సర్వేయర్ బాల్ రెడ్డి శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. కల్వకుర్తి పరిసర గ్రామాలలో వ్యవసాయ భూములు సర్వే చేస్తూ అందరికీ బాల్ రెడ్డి సుపరిచితుడిగా ఉన్నారు. కల్వకుర్తి నుంచి ఇప్పపహాడ్ గ్రామానికి వెళ్తుండగా.. తల తిరిగి కింద పడ్డట్లు స్థానికులు తెలిపారు.