News March 19, 2024
‘బండారుకే పెందుర్తి టికెట్ ఇవ్వాలి’

పెందుర్తి టికెట్ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి ఇవ్వాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం బండారుకు మద్దతుగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు వెన్నెలపాలెం నుంచి పరవాడ వరకు పాదయాత్ర చేపట్టారు. బండారు టికెట్ ఇవ్వని పక్షంలో జనసేన అభ్యర్థికి సహకరించేది లేదని తేల్చి చెప్పారు. మంత్రిగా చేసిన ఒక సీనియర్ నేతకు టికెట్ ఇవ్వకుండా అవమానించడం సమంజసం కాదన్నారు.
Similar News
News September 15, 2025
విశాఖ పీజీఆర్ఎస్కు 329 వినతులు

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలు పరిష్కారం చూపాలని రెవెన్యూ అధికారి భవానీ శంకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం ఆయన ప్రజలు వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 329 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ విభాగానికి చెందినవి 92, జీవీఎంసీకి చెందినవి 88, పోలీసు శాఖకు సంబంధించి 25, ఇతర శాఖలకు సంబంధించి 124 ఉన్నాయి. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శేషశైలజ ఉన్నారు.
News September 15, 2025
పెద్ద గంట్యాడలో ఉచిత శిక్షణ

ఏపీ ప్రభుత్వం స్థాపించిన నేక్ ఆధ్వర్యంలో బ్రాడ్ బాండ్ టెక్నీషియన్ కోర్స్‌లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్ సోమవారం తెలిపారు. పదవ తరగతి పూర్తి చేసి 18-40 సంవత్సరాలలోపు ఎస్సీ కులాలకు చెందిన యువత అర్హులన్నారు. 3 నెలల శిక్షణ అనంతరం ప్రైవేట్ సెక్టార్లో ఉపాధి కల్పిస్తారన్నారు. పెద్ద గంట్యాడ నేక్ సెంటర్లో శిక్షణ అందిస్తామని తెలిపారు.
News September 15, 2025
విశాఖలో ఆరుగురు ఇన్స్పెక్టర్లకు బదిలీ

విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆరుగురు ఇన్స్పెక్టర్లకు బదిలీ చేస్తూ సీపీ శంఖబ్రత బాగ్చి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంవీపీ సీఐ మురళి, వెస్ట్ జోన్ క్రైమ్ సీఐ శ్రీనివాసరావులను విశాఖ రేంజ్‌కు సరెండర్ చేశారు. ఎంవీపీ లా అండ్ ఆర్డర్ సీఐగా ప్రసాద్, వెస్ట్ జోన్ క్రైమ్‌కు చంద్రమౌళి, ద్వారకా ట్రాఫిక్‌కు ప్రభాకరరావు, పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సిటీ వీఆర్‌లో ఉన్న భాస్కరరావును నియమించారు.