News May 8, 2024

బండి సంజయ్ గెలుపు ముందే నిర్ణయమైంది: మోదీ

image

కరీంనగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ విజయం ముందే నిర్ణయమైందని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ ఇక్కడ ఎవరికీ తెలియని అభ్యర్థిని బరిలోకి దింపిందని వేములవాడ సభలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభావం ఏమాత్రం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక ఎలాంటి దర్యాప్తు చేయలేదని చెప్పారు. పీవీ నరసింహరావుకి భారతరత్న ప్రకటించి బీజేపీ గౌరవించిందని తెలిపారు.

Similar News

News January 18, 2025

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ.1,34,601 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.78,994 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.46,250, అన్నదానం రూ.9357 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

News January 18, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కోహెడ మండలంలో రేపు పర్యటించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్. @ వీణవంక మండలంలో తాటి చెట్టు పైనుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు. @ ఎండపల్లి మండలంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం. @ మెట్పల్లి పట్టణంలో ప్రయాణికుల దినోత్సవం. @ పెద్దాపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పై సస్పెన్షన్ ఎత్తివేత. @ లింగ నిర్ధారణ పరీక్షలు జరిపితే చర్యలు తీసుకుంటామన్న కరీంనగర్ కలెక్టర్.

News January 17, 2025

కాంగ్రెస్‌ హామీలే ఓటమికి టికెట్‌: బండి సంజయ్

image

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కరీంనగర్ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పలు విమర్శలు చేశారు. కాంగ్రెస్ హామీలే ఓటమికి టికెట్ అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసిన వాగ్దానాలు తెలంగాణలో కాంగ్రెస్ హామీల మాదిరిగానే పడిపోవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ బూటకపు ప్రచారాలు, బూటకపు హామీలతో ఢిల్లీ తప్పుదోవ పట్టదన్నారు.