News July 9, 2024
బంద్ కారణంగా వాయిదా పడ్డ పరీక్ష 11న నిర్వహణ: టీ.చిట్టిబాబు

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈ నెల నాలుగో తేదీన విద్యార్థి సంఘాల బంద్ కారణంగా వాయిదా పడిన డిగ్రీ రెండవ, నాల్గవ సెమిస్టర్ పరీక్షను ఈ నెల 11వ తేదీన నిర్వహిస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ టీ.చిట్టిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు పరీక్ష జరుగుతుందని, యూజీ విద్యార్థులంతా హాజరుకావాలన్నారు.
Similar News
News December 19, 2025
అదుపుతప్పిన నేవి ప్యారాచూట్.. కోరమాండల్లో ఉద్యోగి ల్యాండ్

నేవీ ఉద్యోగి పారాచూట్పై ఐఎన్ఎస్ డేగా నుంచి ఎగురుతూ అదుపుతప్పి కోరమండల్ పరిశ్రమ ఆవరణలో దిగిపోవడంతో సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. సాంకేతిక లోపంతో కోరమండల్ గేట్ నెంబర్ 10 వద్ద ఉద్యోగి దిగిపోవడంతో కంగారుపడిన సెక్యూరిటీ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగి ఐడీ కార్డు చూపించడంతో నేవీ అధికారులకు అప్పగించారు.
News December 19, 2025
బురుజుపేట: అమ్మవారిని దర్శించుకున్న 10 లక్షల మంది

మార్గశిరమాసం కనకమహాలక్ష్మి అమ్మవారి నెలరోజులు దర్శనాలు విజయవంతంగా నిర్వహించి నేటితో ముగిశాయని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల రోజుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని అభిషేకాలు నిర్వహించారన్నారు. 10 లక్షల మంది భక్తులు దర్శనాలు చేసుకున్నారని తెలిపారు. మహా అన్నదానంలో 20వేల మందికి ప్రతిరోజు అన్నదానం చేశామని చెప్పారు. పోలీసులు సహకరించారని చెప్పారు.
News December 19, 2025
విశాఖ: టెట్ పరీక్షకు 168 మంది గైర్హాజరు

విశాఖలో శుక్రవారం 15 కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహించినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షల్లో 1,848 మంది అభ్యర్థులకు గానూ 1,680 మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. ఈ పరీక్షకు 168 మంది గైర్హాజరు అయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈవో తెలిపారు.


