News July 9, 2024
బంద్ కారణంగా వాయిదా పడ్డ పరీక్ష 11న నిర్వహణ: టీ.చిట్టిబాబు
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈ నెల నాలుగో తేదీన విద్యార్థి సంఘాల బంద్ కారణంగా వాయిదా పడిన డిగ్రీ రెండవ, నాల్గవ సెమిస్టర్ పరీక్షను ఈ నెల 11వ తేదీన నిర్వహిస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ టీ.చిట్టిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు పరీక్ష జరుగుతుందని, యూజీ విద్యార్థులంతా హాజరుకావాలన్నారు.
Similar News
News October 8, 2024
డిసెంబర్‌లో విశాఖ రైల్వేజోన్‌కు శంకుస్థాపన..!
కేంద్ర రైల్వే మంత్రి, సీఎం చంద్రబాబు భేటీలో విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై స్పష్టత వచ్చింది. డిసెంబరు కల్లా కొత్త రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. విభజన హామీలో భాగంగా వాల్తేరు డివిజన్‌ను యథావిధిగా ఉంచాలని కోరినట్లు సమాచారం. అలాగే విశాఖ-అమరావతి మధ్య కొత్త రైల్వేలైన్ ఏర్పాటు, నమోభారత్ కింద విశాఖ-నెల్లూరు మధ్య రైలు అనుసంధానం మెరుగుపరచాలని కోరారు.
News October 8, 2024
విశాఖ-శ్రీకాకుళం రోడ్డు స్టేషన్ మధ్య ప్రత్యేక రైళ్లు
పైడితల్లమ్మ సిరిమాను ఉత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం-శ్రీకాకుళం రోడ్డు స్టేషన్ల మధ్య 08529, 08530 ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ రైళ్లు అక్టోబర్ 10 నుంచి 16 వరకు తిరగనున్నాయని విశాఖ రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు విశాఖపట్నం-శ్రీకాకుళం రోడ్ స్టేషన్ల మధ్య సింహాచలం, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు స్టేషన్లలో ఆగుతాయని పేర్కొన్నారు.
News October 8, 2024
విశాఖలో కార్పొరేటర్‌పై రౌడీ షీట్
జీవీఎంసీ 60వ వార్డు కార్పొరేటర్ పీవీ సురేశ్‌పై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. వైసీపీకి చెందిన సురేశ్‌పై అనేక కేసులు నమోదు అయినట్లు మల్కాపురం పోలీసులు తెలిపారు. సొంత పార్టీ నాయకుల ఫిర్యాదుతోనే నాలుగు కేసులు ఆయనపై నమోదయ్యాయి. దురుసుగా ప్రవర్తించడం, దుర్భాషలాడడంతో ఆయనపై పలు కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.