News June 17, 2024
బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి జూపల్లి

పాలమూరు ప్రజలకు మంత్రి జూపల్లి కృష్ణారావు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు చెప్పారు. త్యాగం, సహనం, ఐకమత్యానికి ప్రతీక బక్రీద్ అన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ సమైక్యతను సహోదర భావాన్ని అందరూ అనుసరించాలని కోరుకుంటూ బక్రీద్ పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News November 12, 2025
MBNR: తగ్గిన ఉష్ణోగ్రతలు.. పెరిగిన చలి

మహబూబ్‌నగర్ జిల్లాల్లో గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో ఉదయం వేళ పొలాల వద్దకు వెళ్లే రైతులు, కంపెనీలో పనిచేసే కార్మికులు, పాఠశాల, కళాశాలకు వెళ్లే విద్యార్థులు చలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్ 14.3, మిడ్జిల్ 14.5, రాజాపూర్ 14.6, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 15.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
News November 12, 2025
MBNR: ‘కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి’

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇంకా ప్రారంభించని గ్రామాలలో వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుండి సంబంధిత శాఖల అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, టెంట్, బ్యానర్ వంటి కనీస వసతులు తప్పనిసరిగా కల్పించాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు.
News November 12, 2025
రాజ్‌కోట్ నుంచి మహబూబ్‌నగర్‌కు పీయూ ఎన్ఎస్ఎస్ బృందం

గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో విజయవంతంగా నిర్వహించిన ప్రీ రిపబ్లిక్ డే నేషనల్ క్యాంప్‌ను పూర్తి చేసుకుని, పీయూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ బృందం మంగళవారం అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ నుండి మహబూబ్‌నగర్‌కు బయలుదేరింది. ఈ బృందం మంగళవారం రాత్రి కాచిగూడ చేరుకుంటుందని పీయూ అధికారులు తెలిపారు. ఈ క్యాంపులో డా.ఎస్.ఎన్.అర్జున్ కుమార్, డా.కె.కవిత కంటింజెంట్ లీడర్లుగా, పలువురు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.


